కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!

కీబోర్డు మీద చకచకా టైప్‌ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు.

Published : 17 Jan 2024 00:01 IST

కీబోర్డు మీద చకచకా టైప్‌ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. వేళ్ల కదలికలను అడుగులుగా భావించి, లెక్కించటమన్నమాట. ఉదాహరణకు- రోజుకు 8 గంటల సేపు కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టామ్‌ మీద పనిచేసేవారు నిమిషానికి సగటున ఐదు అక్షరాలతో కూడిన 40 పదాలను టైప్‌ చేస్తున్నారనుకోండి. వారి వేళ్లు కీబోర్డు మీద సుమారు 2.5 కిలోమీటర్లు ప్రయాణించటంతో సమానమవుతుంది! వినోదం కోసమే అయినా గమ్మత్తయిన విషయమే కదా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని