కంటికి హాయిగా నైట్‌ లైట్‌!

రాత్రిపూట కంప్యూటర్‌ మీద పనిచేస్తున్నప్పుడు కళ్లు త్వరగా అలసిపోతుంటాయి. అదేపనిగా తెరను చూడటం వల్ల నిద్ర సరిగా పట్టదు కూడా. దీనికి కారణం కంప్యూటర్‌ స్క్రీన్‌ నుంచి వెలువడే నీలి కాంతి. మనకు నిద్ర రావటానికి మెలటోనిన్‌ హార్మోన్‌ తోడ్పడుతుంది.

Published : 25 May 2022 01:09 IST

రాత్రిపూట కంప్యూటర్‌ మీద పనిచేస్తున్నప్పుడు కళ్లు త్వరగా అలసిపోతుంటాయి. అదేపనిగా తెరను చూడటం వల్ల నిద్ర సరిగా పట్టదు కూడా. దీనికి కారణం కంప్యూటర్‌ స్క్రీన్‌ నుంచి వెలువడే నీలి కాంతి. మనకు నిద్ర రావటానికి మెలటోనిన్‌ హార్మోన్‌ తోడ్పడుతుంది. నీలి కాంతి ఈ హార్మోన్‌ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. అందుకే పడుకునే ముందు కంప్యూటర్‌ స్క్రీన్‌ను తదేకంగా చూస్తుంటే నిద్ర దెబ్బతింటుంది. దీనికి విండోస్‌ 10, 11లో మంచి పరిష్కారముంది. అదే ‘నైట్‌ లైట్‌’ ఆప్షన్‌. దీన్ని ఎనేబుల్‌ చేసుకోవటమూ తేలికే. ముందుగా డెస్క్‌టాప్‌ మీద ‘స్టార్ట్‌’ బటన్‌తో సెటింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ్నుంచి ‘సిస్టమ్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే ‘డిస్‌ప్లే’ విభాగం కనిపిస్తుంది. ఇక్కడే ‘కలర్‌’ ఫీచర్‌ కింద ‘నైట్‌ లైట్‌’ ఆప్షన్‌ ఉంటుంది. దీన్ని ఆన్‌ చేస్తే నీలికాంతి ఆగిపోతుంది. తెర లేత నారింజ రంగులోకి మారుతుంది. కాంతిని పెంచుకోవటం, తగ్గించుకోవటమూ చేసుకోవచ్చు. కంప్యూటర్‌ స్క్రీన్‌ ఎప్పుడు నైట్‌ లైట్‌ మోడ్‌లోకి మారాలో కూడా ముందే నిర్ణయించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని