మర మనిషి మాయ!
రోబోలు మారి పోతున్నాయి! మనుషులు సూచించిన పనులే కాకుండా, కృత్రిమ మేధతో సొంతంగా ఆలోచించటమూ నేర్చుకుంటున్నాయి
రోబోలు మారి పోతున్నాయి! మనుషులు సూచించిన పనులే కాకుండా, కృత్రిమ మేధతో సొంతంగా ఆలోచించటమూ నేర్చుకుంటున్నాయి. మనుషులకు చేదోడు వాదోడుగా నిలుస్తూ.. ప్రపంచాన్ని మరింత ఆనందమయం చేస్తామనీ అంటున్నాయి. ఇటీవల బెర్లిన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ టెక్నాలజీ ఫెయిర్‌లో అలాంటి రెండు రోబోలు సందడి చేశాయి.
హ్యూనిట్: రోబో చేయి
ఇంట్లో ఎన్నెన్నో పనులు. కొన్నిసార్లు ఇంకో చేయి ఉంటే బాగుండుననీ అనిపిస్తుంటుంది. దక్షిణ కొరియా అంకుర సంస్థ హ్యూనిట్ రూపొందించిన రోబో అలాగే తోడ్పడుతుంది. చేయి మాదిరిగా కదులుతూ సృజనాత్మక పనులు, ఇంటి పనులు ‘ఒంటి’ చేత్తోనే చక్కబెడుతుంది. అధునాతన కృత్రిమ మేధతో కూడిన ఇది సంక్లిష్టమైన పనులనూ, అతి కచ్చితత్వంతో వేగంగా పూర్తి చేస్తుంది. వీడియో తీయటం దగ్గరి నుంచి 3డీ వస్తువులను ముద్రించటం వరకూ ఎన్నెన్నో పనులు చేసి పెడుతుంది. దీని కృత్రిమ మేధ కెమెరా సెకండుకు 30 ఫ్రేములను చిత్రీకరించగలదు. ప్రత్యేకమైన సెన్సర్ల సాయంతో ప్రత్యక్షంగా ముఖాకృతులను, వస్తువులను గుర్తిస్తుంది. దీనికి 2.4 అంగుళాల టచ్ స్క్రీన్‌తో పాటు మాటలను గుర్తించటానికి తోడ్పడే మైక్రోఫోన్ కూడా ఉంటుంది. అంతేకాదు, స్పీకర్ ద్వారా మనతో మాట్లాడుతుంది కూడా. వై-ఫై, బ్లూటూత్‌తో స్మార్ట్‌ఫోన్‌కు తేలికగా అనుసంధానమవుతుంది. హ్యూనిట్ రోబో చేయి 220 డిగ్రీలో కోణంలో తిరుగుతుంది. 750 గ్రాముల బరువును 15.4 అంగుళాల వరకు పైకి ఎత్తగలదు. దీనికి 3డీ ప్రింటర్, హైపవర్ లేజర్ వంటి పరికరాలనూ జత చేసుకోవచ్చు. వీటి ద్వారా చిన్న వస్తువులను 3డీలో ముద్రించుకోవచ్చు. కలప, కాగితం, చర్మం, అల్యూమినియం మీద పేర్లను చెక్కుకోవచ్చు. కావాలంటే పెన్ పరికరంలోకీ మార్చుకోవచ్చు. దీంతో బొమ్మలు గీయటం, రాయటం వంటివి చేయొచ్చు. అవసరమనుకుంటే వంట వండేటప్పుడు గరిటెను తిప్పటానికీ వాడుకోవచ్చు. కప్పుల వంటి వాటినీ అందిస్తుంది. ఇలా నిజమైన చేదోడుగా నిలుస్తుందన్నమాట.
డెస్‌డెమోనా: రోబో కవయిత్రి
ఎప్పుడూ మనం రాసిన కవిత్వమేనా చదువుకోవటం? ఓసారి రోబో రాసే గద్య కవిత్వాన్నీ ఆస్వాదించండి. ఎలా అంటారా? డెస్‌డెమోనా ఉందిగా. ముద్దుగా డెసి అని పిలుచుకునే ఇది ప్రపంచంలో మొట్టమొదటి రోబో పౌరురాలైన సోఫియాకు చెల్లి కూడా. దీన్ని ప్రముఖ కళాకారుడు, రోబో శాస్త్రవేత్త డేవిడ్ హాన్సన్, ఆయన బృందం రూపొందించింది. సింగ్యులారిటీ నెట్ నుంచి సంగ్రహించిన కృత్రిమ మేధను దీనికి జత చేశారు. ఇది ప్రముఖ కళాకారులు, కవులు, శాస్త్రవేత్తలు, రచయితల గ్రంథాలయం నుంచి సమాచారాన్ని గ్రహించి అప్పటికప్పుడు గద్య కవిత్వాన్ని సృష్టిస్తుంది. డెస్‌డెమోనా సృష్టించిన కవిత్వంతో జామ్ గెలాక్సీ బ్యాండు కచేరీలూ నిర్వహిస్తోంది. ఏ రెండు ప్రదర్శనలూ ఒకేలా ఉండకపోవటం గమనార్హం. ఈ రోబో చేతులు, మెడ, కళ్లు కదిలిస్తూ హావభావాలూ ఒలకబో స్తుంది. చక్రాల కాళ్లతో అటూ ఇటూ తిరుగు తుంది కూడా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manipur Violence: అదృశ్యమైన ఆ విద్యార్థుల దారుణ హత్య.. మణిపుర్లో వెలుగులోకి మరో ఘోరం..!
-
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం
-
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala Brahmothsavalu: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం
-
AP Assembly: ఎసైన్డ్ భూములను 20 ఏళ్ల తర్వాత బదలాయించుకోవచ్చు