ఎక్స్‌లో హైలైట్‌

పెయిడ్‌ యూజర్ల కోసం ఎక్స్‌ (ట్విటర్‌) తాజాగా హైలైట్‌ ట్యాబ్‌ను పరిచయం చేసింది. ముఖ్యమైన పోస్టులను తేలికగా అందరికీ తెలియజేయటానికిది ఉపయోగపడుతుంది.

Updated : 23 Aug 2023 01:53 IST

పెయిడ్‌ యూజర్ల కోసం ఎక్స్‌ (ట్విటర్‌) తాజాగా హైలైట్‌ ట్యాబ్‌ను పరిచయం చేసింది. ముఖ్యమైన పోస్టులను తేలికగా అందరికీ తెలియజేయటానికిది ఉపయోగపడుతుంది. ఇవి ప్రొఫైల్‌లో ప్రత్యేక ట్యాబ్‌లో దర్శనమిస్తాయి. ఎక్స్‌ కొద్ది రోజుల క్రితమే కొందరికి హైలైట్‌ ట్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు దీన్ని పెయిడ్‌ యూజర్లందరికీ వర్తింపజేసింది. ఎక్స్‌లో ఇప్పటికే ఒక పోస్ట్‌ను పిన్‌ చేసుకునే సదుపాయముంది. ఇది అన్నింటికన్నా పైన కనిపిస్తుంది. అయితే ఎక్కువ పోస్టులను పిన్‌ చేసుకునే అవకాశం లేదు. హైలైట్‌ ట్యాబ్‌తోలోనైతే చాలా పోస్టులను పెట్టుకోవచ్చు. కళాకారులు, రచయితల వంటి వారు తమ చిత్రాలు, రచనలు, కథనాల వంటి వాటిని ప్రముఖంగా ప్రకటించుకోవటానికిది తోడ్పడుతుంది. పోస్ట్‌ పక్కనుండే మూడు చుక్కల మెనూ ద్వారా ఎన్ని పోస్టులైనా దీనిలో చేర్చుకోవచ్చు. కావాలనుకుంటే తర్వాత తొలగించుకునే సదుపాయమూ ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు