మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?

మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా.

Published : 24 Jan 2024 00:10 IST

మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. దీన్ని తప్పించు కోవటానికి జీమెయిల్‌లో మార్గముంది. మెయిల్‌ను పంపించినవారి పేరు పక్కన ఉండే మూడు చుక్కల మీద క్లిక్‌ చేసి మార్క్‌ అన్‌రీడ్‌ను ఎంచుకుంటే సరి. అప్పుడది ఇంపార్టెంట్‌ విభాగంలోకి వచ్చి చేరుతుంది. అవసరమైనప్పుడు ఈ విభాగంలోకి వెళ్లి చూసుకుంటే చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని