ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..

వెబ్‌సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి.

Updated : 07 Feb 2024 01:04 IST

వెబ్‌సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. మరి తేలికగా, త్వరగా ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలంటే? సెర్చ్‌ చేయటం మంచిది. ఇందుకు తేలికైన మార్గం కంట్రోల్‌, ఎఫ్‌ మీటలను (మ్యాక్‌లోనైతే కమాండ్‌, ఎఫ్‌) కలిపి నొక్కటం. అప్పుడు వెబ్‌సైట్‌ దిగువన ఎడమవైపు సెర్చ్‌ బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో సెల్‌, పార్ట్‌నర్స్‌, అఫిలియేట్స్‌ అనే పదాలను టైప్‌ చేసి సెర్చ్‌ చేస్తే మన డేటాను అమ్ముకుంటున్నారో లేదో తెలుస్తుంది.

  •  హౌ వీ కలెక్ట్‌ యువర్‌ పర్సనల్‌ డేటా వంటి విభాగాలూ మేలు చేస్తాయి. ఇందులో కంపెనీ మన నుంచి ఏయే సమాచారాన్ని ఎలా తీసుకుంటుందో కనిపిస్తుంది.
  •  హౌ వీ యూజ్‌ యువర్‌ పర్సనల్‌ ఇన్ఫర్మేషన్‌ విభాగంలోనూ మన సమాచారాన్ని ఎందుకు తీసుకుంటున్నారో తెలుస్తుంది. బిజినెస్‌ పర్పసెస్‌ వంటి పదాలున్నట్టయితే సమాచారాన్ని షేర్‌ చేస్తున్నారనే అనుకోవచ్చు.
  •  జియో లొకేషన్‌, జియో టార్గెటింగ్‌ వంటివి మన లొకేషన్‌ సమాచారాన్ని సంగ్రహిస్తున్నాయనటానికి నిదర్శనం.
  •  సీవోపీపీఏ(చిల్డ్రన్స్‌ ఆన్‌లైన్‌ ప్రైవసీ ప్రొటెక్షన్‌ యాక్ట్‌)ను ఉద్దేశించిన విషయాలేవైనా ఉన్నాయేమో చూడటం మంచిది. వీటి ద్వారా పిల్లల డేటాను కంపెనీ ఎలా కాపాడుతోందనేది తెలుసుకోవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని