ఫోన్‌ టైపింగ్‌ వేగంగా

స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్‌ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్‌ రిప్లేస్‌మెంట్‌ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్‌ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది.

Published : 17 Jan 2024 00:07 IST

స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్‌ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్‌ రిప్లేస్‌మెంట్‌ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్‌ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. ఉదాహరణకు- గుడ్‌ మార్నింగ్‌కు బదులు జీఎం అని సెట్‌ చేసుకోవచ్చు. ఈమెయిల్‌ చిరునామా కోసం ఎట్‌ గుర్తు వాడతాం కదా. దీన్ని మైహోం వంటి వాటికి షార్ట్‌కట్‌గానూ వాడుకోవచ్చు. ఇందుకోసం..

  • ఐఫోన్‌లో- ముందుగా సెటింగ్స్‌ ద్వారా జనరల్‌ విభాగంలోకి వెళ్లాలి. అనంతరం కీబోర్డు విభాగంలో టెక్స్ట్‌ రిప్లేస్‌మెంట్‌ను ఎంచుకోవాలి. ఇందులో ప్లస్‌ గుర్తు మీద క్లిక్‌ చేసి, పదబంధాన్ని ఎంటర్‌ చేయాలి. తర్వాత దాన్ని షార్ట్‌కట్‌గా నిర్ణయించుకొని సేవ్‌ చేసుకోవాలి.
  •  ఆండ్రాయిడ్‌లో- గూగుల్‌ కీబోర్డు సాయంతో టెక్స్ట్‌ రిప్లేస్‌మెంట్‌ను సెట్‌ చేసుకోవచ్చు. ముందు జీబోర్డు సెటింగ్స్‌లోకి వెళ్లాలి. ఇందులో డిక్షనరీ మీద ట్యాప్‌ చేస్తే పర్సనల్‌ డిక్షనరీ ఆప్షన్‌ కనిపిస్తుంది. అనంతరం భాషను ఎంచుకొని ప్లస్‌ గుర్తు మీద తాకాలి. మొదటి బాక్సులో పదం లేదా పదబంధాన్ని టైప్‌ చేయాలి. దీన్ని జీబోర్డు గుర్తు పెట్టుకుంటుంది. రెండో బాక్సులో షార్ట్‌కోడ్‌ను టైప్‌ చేయాలి. టైప్‌ చేసేటప్పుడు దీన్ని ఎంచుకుంటే నిర్ణయించుకున్న పదం, పదబంధం ప్రత్యక్షమవుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని