మన మెయిల్‌ మనకే!

కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది

Published : 10 Jan 2024 00:36 IST

కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది. నిర్ణీత సమయానికి లక్ష్యాలను గుర్తుచేయటానికి తేలికైన మార్గం ఒకటుంది. అది మనకు మనమే ఈమెయిల్‌ రాసుకోవటం. దాన్ని భవిష్యత్‌లో మనకు అందేలా నిర్ణయించుకోవటం. అదెలా సాధ్యమనేగా మీ అనుమానం. అయితే తెలుసుకోవాల్సిందే.

  • మనకు మనమే ఉత్తరం రాసుకోవటానికి ఫ్యూచర్‌ మీ వెబ్‌సైట్‌ను (https://www.futureme.org) వాడుకోవచ్చు. ఇందులో జీవితంలో దేని గురించైనా రాసుకోవచ్చు. దాన్ని ఆరు నెలల నుంచి పదేళ్ల వరకూ ఎప్పుడైనా అందేలా సమయాన్ని ఎంచుకోవచ్చు. ఇంకేం ఆశలు, ఆశయాలు, కలలు అన్నింటినీ రాసుకొని, సెండ్‌ బటన్‌ నొక్కేస్తే సరి.
  • వేరే వెబ్‌సైట్లు ఎందుకనుకుంటే సొంత జీమెయిల్‌, అవుట్‌లుక్‌ వంటి ఈమెయిళ్ల సేవలనూ వాడుకోవచ్చు. మన ఆలోచనలను ఈమెయిల్‌లో రాసుకొని భవిష్యత్‌లో చేరాల్సిన తేదీని నిర్ణయించుకొని సెండ్‌ చేయొచ్చు. లేదా మెయిల్‌ను డ్రాఫ్ట్‌ రూపంలో సేవ్‌ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు ఓపెన్‌ కావాలో క్యాలెండర్‌లో రిమైండర్‌ను సెట్‌ చేసుకుంటే చాలు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని