అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా

అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్‌ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

Published : 24 Jan 2024 00:27 IST

అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్‌ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇలా పెద్దఎత్తున వచ్చిపడే అవాంఛిత ఈమెయిళ్ల బెడదను తేలికగా వదిలించుకోవటానికి జీమెయిల్‌ కొత్త మార్పులను ప్రవేశపెట్టింది. ఇవి మొబైల్‌, వెబ్‌.. రెండు వర్షన్లకూ వర్తిస్తాయి. వెబ్‌లో అన్‌సబ్‌స్క్రయిబ్‌ బటన్‌ ఇప్పుడు థ్రెడ్‌ జాబితాలో హోవర్‌ యాక్షన్స్‌లో కనిపిస్తుంది. దీన్ని క్లిక్‌ చేయగానే మెయిల్‌ను పంపించినవారికి హెచ్‌టీటీపీ రిక్వెస్ట్‌ను గానీ ఈమెయిల్‌ను గానీ పంపిస్తుంది. మెయిలింగ్‌ అడ్రస్‌ నుంచి యూజర్‌ను తొలగించమని సూచిస్తుంది. ఆండ్రాయిడ్‌, ఏఓస్‌ పరికరాల్లోనైతే ఈ అన్‌సబ్‌స్క్రయిబ్‌ బటన్‌ మరింత స్పష్టంగా కనిపించేలా మూడు చుక్కల బటన్‌లో చేర్చారు. ఇప్పటివరకూ ఒకటిగా ఉన్న రిపోర్ట్‌ స్పామ్‌ అండ్‌ అన్‌సబ్‌స్క్రయిబ్‌ విభాగాన్ని గూగుల్‌ రెండుగా విభజించనుంది కూడా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని