ఆలూ యాంటీబయాటిక్‌!

ఆలుగడ్డ తినటానికి రుచిగానే కాదు, మందుల నిలయంగా తోడ్పడుతోంది! అంతర్జాతీయ పరిశోధకులు దీనిలో ఓ కొత్త యాంటీబయాటిక్‌ను కనుగొన్నారు మరి.

Updated : 30 Nov 2022 00:19 IST

లుగడ్డ తినటానికి రుచిగానే కాదు, మందుల నిలయంగా తోడ్పడుతోంది! అంతర్జాతీయ పరిశోధకులు దీనిలో ఓ కొత్త యాంటీబయాటిక్‌ను కనుగొన్నారు మరి. దీని పేరు సొలనమైసిన్‌. ఆలుగడ్డలోని డికేయ సొలని అనే బ్యాక్టీరియా నుంచి దీన్ని తయారుచేశారు. పంటలను నాశనం చేసే పలు రకాల ఫంగస్‌లను ఇది సమర్థంగా నిర్మూలిస్తుంది. మనుషుల్లో తీవ్ర ఇన్‌ఫెక్షన్లకు దారితీసే క్యాండిడా అల్బికన్స్‌ను సైతం ఎదుర్కొంటున్నట్టు ప్రయోగ పరీక్షల్లో తేలింది. యాంటీబయాటిక్‌ మందులను విచ్చలవిడిగా వాడుతుండటం వల్ల అవి రోజురోజుకీ నిర్వీర్యం అవుతున్నాయి. ఇన్‌ఫెక్షన్లను అడ్డుకోలేని స్థితికి చేరుకుంటున్నాయి. పరిస్థితిలాగే కొనసాగితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులు మరో పదేళ్లలో పనిచేయలేని స్థితికి చేరుకుంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త యాంటీబయాటిక్‌ మందు కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీబయాటిక్స్‌ను చాలావరకు నేలలోని సూక్ష్మ జీవుల నుంచి రూపొందిస్తున్నారు. వృక్ష ఆధారిత సూక్ష్మజీవులూ యాంటీబయాటిక్స్‌ తయారీకి మంచి వనరులుగా ఉపయోగపడగలవని తాజా అధ్యయనంతో రుజువైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని