Google Trending 2021: క్రికెట్ తర్వాతే కరోనా.. అక్కడ ‘జై భీమ్’దే హవా
ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా వెతికిన సమాచారానికి సబంధించి గూగుల్ ట్రెండింగ్ 2021 పేరుతో గూగుల్ ఒక జాబితాను విడుదల చేసింది. మరి వాటిల్లో ఏం ఉన్నాయో మీరు చూసేయండి.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుత సాంకేతిక యుగంలో ఏ చిన్న సమాచారం కావాలన్నా నెట్టింట్లో వెతకాల్సిందే. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో నెట్ వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో 2021లో భారతీయులు గూగుల్ (Google Trends 2021)లో ఎక్కువగా వెతికిన సమాచారానికి సంబంధించిన జాబితాను గూగుల్ విడుదల చేసింది. మరి వీటిలో ఏయే అంశాల గురించి యూజర్స్ ఎక్కువగా వెతికారో చూద్దాం.
క్రీడలదే అగ్రస్థానం
గతేడాదిలానే ఈ ఏడాది కూడా కరోనా భయం వెంటాడింది. ఈ నేపథ్యంలో కరోనా టీకా అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. అయితే దేశంలో క్రికెకట్‌కు ఎంతో క్రేజ్ ఉందని మరోసారి రుజువైంది. 2020లోలానే ఈ ఏడాది కూడా ఎక్కువ మంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), టీ20 వరల్డ్ కప్ గురించి ఎక్కువగా వెతికారట. దీంతో టాప్ 10 జాబితాలో ఐపీఎల్ మొదటి, కొవిన్ పోర్టల్ రెండు, ఐసీఐసీఐ టీ20 వరల్డ్ కప్ మూడో స్థానాల్లో ఉన్నాయి. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో యూరో కప్, టోక్యో ఒలింపిక్స్ నిలిచాయి. పూర్తి జాబితా ఇదే..
1. ఐపీఎల్ | 2. కొవిన్ పోర్టల్ | 3. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ | 4. యూరో కప్ | 5. టోక్యో ఒలింపిక్స్ | 6. కొవిడ్ వ్యాక్సిన్ | 7. ఫ్రీ ఫైర్ రిడీమ్ కోడ్ | 8. కోపా అమెరికా 9. నీరజ్ చోప్రా | 10. ఆర్యన్ ఖాన్
కొవిడ్ గురించే వెతుకులాట..
తమ దగ్గర్లో (Near Me) అందుబాటులో ఉన్న సేవల గురించి వెతికే జాబితాలో ఎక్కువ మంది కొవిడ్‌కు సంబంధించిన సమాచారం గూగుల్ చేశారట. దగ్గరోని వ్యాక్సినేషన్ కేంద్రాలు, కొవిడ్ పరీక్షలు, ఉచిత ఫుడ్ డెలివరీ, ఆక్సిజన్ సిలిండర్‌లు, కొవిడ్ ఆస్పత్రుల వంటివి జాబితాలో టాప్ 5లో ఉన్నాయి.
1. కొవిడ్ వ్యాక్సిన్ | 2. కొవిడ్ టెస్ట్ | 3. ఉచిత ఫుడ్ డెలివరీ | 4. ఆక్సిజన్ సిలిండర్ | 5. కొవిడ్ ఆస్పత్రి | 6. టిఫిన్ సర్వీస్ | 7. సీటీ స్కాన్ | 8. టేకవుట్ రెస్టారెంట్ | 9. ఫాస్టాగ్ | 10. డ్రైవింగ్ స్కూల్
‘జై భీమ్’కే ఓటు
సినిమా కేటగిరీలో ఈ ఏడాది ఎక్కువ మంది సూర్య నటించిన జై భీమ్ సినిమా గురించే వెతికారట.పేద కుటుంబంపై పోలీసులు అన్యాయంగా చేసిన దాడిని తెరపై ఆలోజింపజేసేలా చిత్రీకరించారు దర్శకుడు టి.జె.జ్ఞానవేల్. ఇందులో సూర్య లాయర్‌గా నటించారు. జై భీమ్ తర్వాత ఎక్కువగా సిద్ధార్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నంటించిన షేర్షా సినిమా గురించి వెతికారు. కార్గిల్ యుద్ధంలో అసమాన పోరాటం చేసి అమరుడైన ఇండియన్ ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
1. జై భీమ్ | 2. షేర్షా | 3. రాధే | 4. బెల్‌బాటమ్ | 5. ఎటర్నల్స్ | 6. మాస్టర్ | 7. సూర్యవంశీ | 8. గాడ్జిల్లా vs కాంగ్ | 9. దృశ్యం 2 | 10. భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా
వ్యక్తుల్లో నీరజ్ చోప్రా
వ్యక్తుల జాబితాలో టోక్యో ఒలిపింక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో భారత్‌కు బంగారు పతకం అందించిన నీరజ్ చోప్రా గురించి ఎక్కువ మంది యూజర్స్ గూగుల్ చేశారట. తర్వాత షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ కోసం వెతకగా, మూడో స్థానంలో నటి షెహనాజ్ గిల్, నాలుగులో రాజ్ కుంద్రా, ఐదులో ఎలాన్ మస్క్ ఉన్నారు. మరి తర్వాతి స్థానాల్లో ఎవరున్నారో మీరూ చూసేయండి..
1. నీరజ్ చోప్రా | 2. ఆర్యన్ ఖాన్ | 3. షెహనాజ్ గిల్ | 4. రాజ్ కుంద్రా | 5. ఎలాన్ మస్క్ | 6. విక్కీ కౌశల్ | 7. పీవీ సింధు | 8. బజరంగ్ పునియా | 9. సుశీల్ కుమార్ | 10. నటాషా దలాల్
ఎలా చేయాలి..
ఎలా చేయాలి (How To) అనే పదంతో ఎక్కువగా కొవిడ్ వ్యాక్సిన్, కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్, ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి, పాన్-ఆధార్ ఎలా లింక్ చేయాలి, ఇంట్లోనే ఆక్సిజన్ ఎలా తయారు చేయాలనే అంశాల గురించి వెతికినట్లు గూగుల్ వెల్లడించింది.
1. కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ | 2. వ్యాక్సిన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ | 3. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవడం | 4. పాన్-ఆధార్ లింక్ | 5. ఇంట్లోనే ఆక్సిజన్ తయారీ | 6. ఇండియాలో డోగేకాయిన్ (క్రిప్టోకరెన్సీ) కొనుగోలు | 7. బనానా బ్రీడ్ తయారీ | 8. ఐపీఓ కేటాయింపులు | 9. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు | 10. మార్కుల పర్సంటేజ్ లెక్కింపు
వార్తల్లో టాప్ టెన్ ఇవే
వార్తలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి టోక్యో ఒలిపింక్స్ గురించిన సమాచారం తెలుసుకునేందుకు ఎక్కువగా వెతికినట్లు గూగుల్ వెల్లడించింది. తర్వాత బ్లాక్‌ఫంగస్, అఫ్గాన్ వార్తలు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, లాక్‌డౌన్ వంటి వాటి గురించి యూజర్స్ ఎక్కువగా గూగుల్ చేశారు.
1. టోక్యో ఒలిపింక్స్ | 2. బ్లాక్ ఫంగస్ | 3. అఫ్గాన్ వార్తలు | 4. పశ్చిమబెంగాల్ ఎన్నికలు | 5. ట్రాపికల్ సైక్లోన్ | 6. లాక్‌డౌన్ | 7. సూయజ్ కెనాల్ క్రైసిస్ | 8. రైతుల నిరసన | 9. బర్డ్ ఫ్లూ | 10. సైక్లోన్ యాస్
తెలుసుకోవాలనే తపన
కరోనా తర్వాత వచ్చే బ్లాక్ ఫంగస్ గురించి కూడా తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరిచారు. అంటే ఏమిటి (What is) తో వెతికిన జాబితాలో బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ హన్రెండ్, తాలిబన్, అఫ్గాన్‌లో ఏం జరుగుతుంది, రెమెడెసివిర్‌ల గురించి ఎక్కువగా వెతికారట.
1. బ్లాక్‌ఫంగస్ | 2. ఫాక్టోరియల్ ఆఫ్ హన్రెండ్ | 3. తాలిబన్ | 4. అఫ్గాన్‌లో ఏం జరుగుతుంది | 5. రెమెడెసివిర్ | 6. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 | 7. స్టెరాయిడ్ | 8. టూల్‌కిట్ | 9. స్క్విడ్ గేమ్ | 10. డెల్టా ప్లస్ వేరియంట్
ఆటలకు సంబధించిన జాబితాలో ఐపీఎల్, ఐసీసీ టీ20 వరల్గ్ కప్, యూరో కప్, టోక్యో ఒలిపింక్స్, కోపా అమెరికా టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి. వంటల కేటగిరీలో పుట్టగొడులు, ఆవిరి కుడుములు, మెతీ మటర్ మలాయి, పాలక్, చికెన్ సూప్‌ల గురించి ఎక్కువగా వెతికినట్లు గూగుల్ వెల్లడించింది.
► Read latest Gadgets & Technology News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/09/2023)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్