
Face ID with Mask: మాస్క్ ఉన్నా ఫేస్‌ఐడీ అన్‌లాక్.. ఈ కంపెనీ తొలి ప్రయత్నం!
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ మహమ్మారి వస్తూ వస్తూనే చాలా కష్టాలు మోసుకొచ్చింది. ఆరోగ్యపరంగానే కాదు.. సాంకేతికంగానూ కొత్త కష్టాలను తెచ్చింది. అలాంటి వాటిలో ఒకటి స్మార్ట్‌ఫోన్లలో ఫేస్ ఐడీ ఫీచర్ పనిచేయకపోవడం. కొవిడ్ పుణ్యమా అని అందరూ మాస్కులు ధరించాల్సి రావడంతో ఈ ఫీచర్ నిరుపయోగంగా మారిపోయింది. వేల రూపాయలు పెట్టి ఫోన్‌లో అయినా ఫేస్‌ఐడీ సదుపాయం పనిచేయకపోవడంతో అందరూ మళ్లీ ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్‌నో, పిన్, పాస్‌వర్డ్‌పైనో ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ టెక్ కష్టానికి ఐఫోన్లు తయారు చేసే యాపిల్ సంస్థ పరిష్కార మార్గం చూపింది.
ఈ కంపెనీ త్వరలో తీసుకురాబోయే ఐవోఎస్ 15.4 అప్‌డేట్‌లో మాస్క్ ఉన్నా ఫోన్ అన్‌లాక్ అయ్యే సదుపాయాన్ని తీసుకురాబోతోంది. యూజర్ల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందడంతో యాపిల్ ఈ మార్పుకు సిద్ధమైంది. కొత్త ఫేస్‌ఐడీ సదుపాయం పొందాలంటే ఐవోఎస్ 15.4కు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి ఈ అప్‌డేట్ వచ్చాక సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫేస్‌ఐడీ సదుపాయాన్ని మాస్క్ ఉన్నా ఓపెన్ అయ్యే విధంగా మార్పు చేసుకోవచ్చు. ఈ సెటప్ చేయడానికి మాస్కు ధరించాల్సిన అవసరం లేదు. సాధారణంగా మనం ఫేస్ ఐడీని ఎలా సెట్ చేస్తామో అలానే సెట్ చేసుకోవచ్చు. అయితే, ఐఫోన్ ఎక్స్, ఆ తర్వాతి మోడళ్లలో మాత్రమే ఈ ఫీచర్ పనిచేయనుందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్దిరోజలు ఆగాల్సిందే!
ఇవీ చదవండి
Advertisement