WhatsApp: త్వరలో మరో ‘ఆరు’ ఫీచర్లు
యూజర్ల కోసం ఫీచర్లను అప్డేట్ చేయడంలో వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలో మరికొన్ని ఫీచర్లను యాడ్ చేసేందుకు వాట్సాప్ ప్రయత్నాలు చేస్తోంది..
ఇంటర్నెట్ డెస్క్: యూజర్ల కోసం ఫీచర్లను అప్డేట్ చేయడంలో ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలో మరికొన్ని ఫీచర్లను యాడ్ చేసేందుకు వాట్సాప్ ప్రయత్నాలు చేస్తోంది. మీ చాట్ లిస్ట్‌లకు న్యూ లుక్ తేవడంతో పాటు, వాయిస్ నోట్ వేవ్‌ఫామ్స్, స్టిక్కర్ ప్యాక్స్, మిస్డ్ గ్రూప్ కాల్స్, రీడ్ లేటర్, న్యూ ఫ్లాష్ కాల్స్ వంటి ఫీచర్లను తీసుకురానుంది. అయితే ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వాట్సాప్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ఆ ఫీచర్ల గురించి తెలుసుకుందామా..!
ఇక లైన్ రాదు.. స్టిక్కర్స్‌కు షార్ట్‌కట్
ప్రస్తుతం మీరు వాయిస్ మెసేజ్‌ను రికార్డ్ చేసి పంపారు. వాయిస్ మెసేజ్ ప్లే అయ్యేటప్పుడు ఎలా వస్తుంది..? స్ట్రైట్ లైన్ కనిపిస్తుంటుంది. ఇకపై లైన్ కాకుండా వేవ్స్ వచ్చేలా ఫీచర్‌ను యాడ్ చేయబోతోంది. అయితే ఇప్పటికే ఆండ్రాయిడ్ వెర్షన్స్ బీటా టెస్టర్స్లో ఫీచర్ ఉంది. ఐఓఎస్ యూజర్ల కోసం త్వరలో రానుంది. అలానే స్టిక్కర్ ప్యాక్స్ కోసం షార్ట్కట్లు రాబోతున్నాయి. సన్నిహితులకు స్టిక్కర్ ప్యాక్స్‌ను పంపించేందుకు షార్ట్‌కట్ ఉపయోగపడుతుంది. స్టిక్కర్ స్టోర్ కూడా ఎమోజీ సెక్షన్లోనే కనిపిస్తుంది. ఇప్పటికే ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా.. ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో రానుంది.
కొత్త లుక్‌లో చాట్ లిస్ట్
ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ (యూఐ)కు మార్పులు చేసేందుకు వాట్సాప్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో మార్పులు చేసింది. చాట్ లిస్ట్‌లో చాట్ సెల్స్‌ను వేరు చేసే లైన్‌ను తీసేయనుంది. యాప్ మొత్తం రీడిజైన్ కాదని, చిన్నపాటి యూఐ మార్పు మాత్రమేనని వాట్సాప్ చెబుతోంది. ఇటీవల ఆండ్రాయిడ్‌లో నోటిఫికేషన్స్‌కు సంబంధించి రంగును మార్చిన విషయం తెలిసిందే. దీని వల్ల డార్క్‌మోడ్‌లో నోటిఫికేషన్లు ఆకుపచ్చ రంగు బదులు నీలి రంగులో కనిపిస్తాయి. ఇలాంటి మార్పునే లైట్మోడ్కూ పరిచయం చేయనుంది. అలాగే న్యూ బీటా అప్డేట్లో వాట్సాప్ లోగో, బ్యాడ్జ్, రిప్లే, ‘మార్క్ యాజ్ రీడ్’ బటన్స్ కూడా నీలిరంగులో కనిపించనున్నాయి. కలర్ స్కీమ్ కేవలం ఆండ్రాయిడ్ వెర్షన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది.
మిస్డ్ గ్రూప్ కాల్
ఇదొక మంచి ఫీచర్‌గా చెప్పొచ్చు. గ్రూప్ కాలింగ్ నుంచి మీకు ఆహ్వానం అందిన సమయంలో మీరు వేరే పనిలో బిజీగా ఉన్నప్పుడు, ఆ గ్రూప్ కాలింగ్‌లో జాయిన్ అయ్యేందుకు వీలు పడటం కుదరదు. అలాంటప్పుడు వారితో మాట్లాడలేకపోతున్నామనే బాధ ఉంటుంది. ఇలాంటి వారి కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను యాడ్ చేయబోతోంది. ఆ గ్రూప్ కాల్ ఎండ్ అయ్యేలోపు మీరు దానిలో జాయిన్ అయ్యే అవకాశం కల్పించనుంది. దీని వల్ల మధ్యలోనైనా సంభాషించే వీలు కలుగుతుంది. గతేడాది ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో వాట్సాప్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఐఓఎస్ యూజర్ల కోసం టెస్ట్ చేస్తోంది. మరి కొన్ని రోజుల్లో ఈ ఫీచర్ రావొచ్చు.
రీడ్ లేటర్.. న్యూ ఫ్లాష్ కాల్స్
‘రీడ్ లేటర్’ఫీచర్‌పై వాట్సాప్ ముమ్మరంగా పని చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆర్కివ్డ్ చాట్స్ ఫీచర్ స్థానంలో రీడ్ లేటర్ తీసుకొచ్చేలా వాట్సాప్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆర్కివ్డ్ చాట్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసినప్పుడు చాటింగ్ గ్రూప్ చివరికి వెళ్లిపోతుంది. ఆ గ్రూప్‌నకు ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు మాత్రమే మళ్లీ పైకి వచ్చి కనిపిస్తుంది. ఇప్పుడు ‘రీడ్ లేటర్’ ఫీచర్‌తో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని వాట్సాప్ భావిస్తోంది. అలాగే న్యూ ఫ్లాష్ కాల్స్ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. ఆటోమేటిక్ వెరిఫికేషన్ ద్వారా ఒక్క కాల్‌తో వాట్సాప్‌ను వేగంగా లాగిన్ అయ్యేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో ఉండగా.. మరికొన్ని రోజుల్లో అందరికీ అందుబాటులోకి రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైక్రోసాఫ్ట్ 2ఎఫ్ఏ ఎలా?
మైక్రోసాఫ్ట్ ఖాతాను మరింత సురక్షితం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే టూఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను (2ఎఫ్ఏ) సెట్ చేసుకోండి. రోజురోజుకీ హ్యాకింగ్ పద్ధతులు తెలివి మీరుతున్న నేపథ్యంలో ఇది తప్పనిసరి. -
గూగుల్ ఖాతా భద్రం
‘ఫేస్బుక్లో అలాంటి పోస్ట్ పెట్టావేంటి?’ అని మిత్రులెవరైనా అడిగారా? మీరు పంపించని మెయిళ్లు అవుట్బాక్సులో కనిపిస్తున్నాయా? మీ పేరు మీద ఎవరో రుణాలు తీసుకున్నట్టు గుర్తించారా? ఇవీ ఒకరకం మోసాలే. -
‘కీప్’ గోయింగ్!
రోజురోజుకీ నోట్-టేకింగ్ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రయోజనాలు ఉండటంతో యువత వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు బోలెడన్ని ఉచిత నోట్ టేకింగ్ యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. -
అమెజాన్ మ్యూజిక్‌లో ఏఐ ప్లేలిస్టు ఫీచర్
సంగీత ప్రియులను ఆకట్టుకోవటానికి మ్యూజిక్ యాప్‌లు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్పోటిఫై ఇటీవల ప్రీమియం యూజర్ల కోసం ఏఐ ఆధారిత ప్లేలిస్ట్ జనరేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
వెబ్‌లోనూ ట్రూకాలర్
స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్‌ను చాలాకాలంగా వాడుతూనే ఉన్నాం. అజ్ఞాత, స్పామ్ కాల్స్‌ను గుర్తించటానికిది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడిది వెబ్ బ్రౌజర్ రూపంలోకీ మారింది. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్‌జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్‌ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్‌ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్
ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంఎస్ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్‌లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. -
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది -
ఏఐ పాట
కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్ జనరేటర్ వేదిక. -
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు.