ఆ ఘనత తెరాస ప్రభుత్వానిదే: ఇంద్రకరణ్‌ రెడ్డి

రాష్ట్రంలోని దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగులకు అత్యుత్తమమైన వేతన వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని

Updated : 15 Oct 2020 21:03 IST

హైదరాబాద్: రాష్ట్రంలోని దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగులకు అత్యుత్తమమైన వేతన వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బేతి రంగారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన అర్చక ఉద్యోగ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన అర్చక ఉద్యోగ సంఘం జేఏసీ కన్వీనర్‌ డీవీఆర్‌ శర్మ, ప్రధాన కార్యదర్శి ఆనంద్‌ శర్మ మంత్రి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని మంత్రి అభినందించారు. అర్చక ఉద్యోగులకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా వేతనాలు చెల్లించాలని ఈ సందర్భంగా వారు మంత్రిని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రాట్యుటీ ఇవ్వాలని.. అర్హత ఉన్నవారికి పదోన్నతులు కల్పించాలని మంత్రిని కోరారు. సీఎం కేసీఆర్‌ హయాంలో రాష్ట్ర అర్చక ఉద్యోగులకు ఎంతో మేలు జరిగిందని అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బేతి రంగారెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని