డీఈవో, ఎంఈవోలే బాధ్యులు

తమ పరిధిలోని పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్‌ జరిగితే డీఈఓలు, ఎంఈఓలు బాధ్యులు అవుతారని ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్‌ఎస్‌సీ బోర్డు) సంచాలకుడు కృష్ణారావు పేర్కొన్నారు.

Published : 21 May 2022 05:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: తమ పరిధిలోని పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్‌ జరిగితే డీఈఓలు, ఎంఈఓలు బాధ్యులు అవుతారని ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్‌ఎస్‌సీ బోర్డు) సంచాలకుడు కృష్ణారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో పనిచేసే ఇన్విజిలేటర్లు వ్యక్తిగతంగా కాపీయింగ్‌కు బాధ్యులవుతారని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాపీయింగ్‌పై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ప్రతి డీఈఓ, ఎంఈఓ ఒక రిజిస్టర్‌లో నమోదు చేసి...వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని