హక్కుపత్రాలు లేకుండా కొనుగోలు చేశారు
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో సర్వే నంబరు 81లో 5.36 ఎకరాలు, సర్వే నంబరు 130 లో 3 ఎకరాల భూమిని జమున హేచరీస్ యాజమాన్యం కబ్జా చేసిందని, పూర్తి స్థాయి సర్వేలో ఈ విషయం
జమునా హేచరీస్ భూమి వ్యవహారంపై మెదక్ కలెక్టర్ హరీష్
మెదక్, న్యూస్‌టుడే: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో సర్వే నంబరు 81లో 5.36 ఎకరాలు, సర్వే నంబరు 130 లో 3 ఎకరాల భూమిని జమున హేచరీస్ యాజమాన్యం కబ్జా చేసిందని, పూర్తి స్థాయి సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు. ఆ భూములను తాము న్యాయబద్ధంగా కొనుగోలు చేసి ధరణిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామన్న ఈటల జమున ప్రకటనపై ఆయన మంగళవారం వివరణ ఇచ్చారు. అచ్చంపేటలో సర్వే నం.130లో 18.35 ఎకరాల స్థలాన్ని సీలింగ్ మిగులు భూమిగా ప్రకటించి 1990లో 11 మంది పేదలకు కేటాయించారన్నారు. ఈ సర్వే నంబర్లో 3 ఎకరాలను ఎలాంటి హక్కులు లేని రామారావు నుంచి కొనుగోలు చేశారని అన్నారు. సర్వే నంబరు 130లో సీలింగ్ మిగులు భూమిపై రిజిస్ట్రేషన్ శాఖ 2007లో నిషేధం విధించిందని, అందులో వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. సర్వే నంబరు 130లో అసైన్డ్‌దారుల నుంచి జమునా హేచరీస్ అక్రమంగా కొనుగోలు చేసి తెల్లకాగితంపై లావాదేవీలు నిర్వహించినట్లు తమ వద్ద రికార్డులు ఉన్నాయన్నారు. అచ్చంపేటలో ఎసైన్డ్భూమిని జమున హేచరీస్ యాజమాన్యం ఆక్రమించుకుందని తెలిపారు.
సర్వే నంబరు.81లో 16.19 ఎకరాల స్థలంలో 14.05 ఎకరాలను మిగులు భూమిగా ప్రకటించి పేదలకిచ్చారని పాలనాధికారి తెలిపారు. ఈ సర్వే నంబరులో కూడా 5.36 ఎకరాలను రామారావు నుంచి కొనుగోలు చేశారని పేర్కొన్నారు. సర్వే నం.81, 130లో 8.36 ఎకరాలను ధరణి ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నామని జమున పేర్కొనడం సరికాదని, ధరణి గతేడాది నవంబర్ నుంచి మాత్రమే అమల్లో ఉందని, అంతకు ముందే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కలెక్టర్ స్పష్టంచేశారు.
‘ఈటల క్షమాపణలు చెప్పాలి’
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ, ఎస్సీ, ఎస్టీ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారని నిగ్గు తేలిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మెదక్ కలెక్టర్ ఆధారాలతో సహా చూపించారన్నారు. 71 ఎకరాల పేదల భూములు లాక్కున్న ఈటల తప్పయిందని 71 సార్లు ముక్కు నేలకు రాయాలని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాలు బయటపడినా ఈటల అభాండాలు వేసేందుకు, నిజాయితీగా పని చేస్తున్న కలెక్టర్‌ను భయపట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో సుమన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని’’ సుమన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంకా చిక్కని చిరుత
ఎయిర్పోర్ట్ రన్‌వే మైదానంలో ప్రహరీ దూకిన చిరుతను బంధించడానికి అటవీ శాఖ, విమానాశ్రయంలో భద్రతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం అదనంగా మరో బోనును ఏర్పాటు చేసి, అనుమానిత ప్రాంతాల్లో 10 ట్రాప్ కెమెరాలను బిగించారు. -
తాండూరు కందులకు రికార్డు ధర
వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాలు నాణ్యమైన కందులకు గరిష్ఠంగా రూ.12,705 ధర వచ్చింది. మార్కెట్ చరిత్రలో రికార్డు ధరగా నమోదైందని వ్యవసాయ మార్కెట్ పర్యవేక్షకులు హబీబ్ తెలిపారు. -
కేయూలో దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి
కాకతీయ విశ్వవిద్యాలయంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం సభ్యులపై దాడికి పాల్పడ్డ ఏబీవీపీ, బజరంగ్దళ్ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. -
మే 24న పాలిసెట్
పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా ‘పాలిసెట్’ మే 24న నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా సమన్వయాధికారిణి, మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్.రాజేశ్వరీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వివరాలు ఏప్రిల్ 30 నాటికి పంపించాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతివెస్లీ సోమవారం ఆదేశాలు జారీచేశారు. -
‘టెయిల్‌పాండ్’ నీటి తరలింపుపై వివరణ ఇవ్వండి
తమ అనుమతి లేకుండా నాగార్జునసాగర్ దిగువన ఉన్న టెయిల్‌పాండ్ నుంచి నీటిని తరలించడంపై వివరణ ఇవ్వాలంటూ కృష్ణా బోర్డు ఏపీ నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాసింది. -
రాధాకిషన్‌రావు బెయిల్ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు బెయిల్ పిటిషన్‌పై విచారణను నాంపల్లి కోర్టు ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఎక్సైజ్ అధికారుల బదిలీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేం హైకోర్టు
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపునిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. -
సీఎం రేవంత్‌కు నోటీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. -
955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. -
ఉదయం 11 గంటలకు పది ఫలితాలు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు వెల్లడికానున్నాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు. -
పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి
తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్‌ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!