జలాశయాలకు కొత్తనీరు!

ఇటీవలి వర్షాలకు పలు జలాశయాల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర నదికి ఈ ఏడాది ముందుగానే నీటిప్రవాహం ప్రారంభమయింది. జలాశయానికి 61,189 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 19.77

Updated : 22 May 2022 06:23 IST

తుంగభద్రకు 61 వేల క్యూసెక్కుల రాక
ముందుగానే ప్రారంభమైన ప్రవాహం

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవలి వర్షాలకు పలు జలాశయాల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర నదికి ఈ ఏడాది ముందుగానే నీటిప్రవాహం ప్రారంభమయింది. జలాశయానికి 61,189 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 19.77 (పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు) టీఎంసీల నీరు ఉంది. డ్యాం దిగువన ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న సుంకేశుల వద్ద 19,896 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. కృష్ణా పరీవాహకంలోనూ స్వల్పంగా ప్రవాహం వస్తోంది. శ్రీశైలంలోకి 3 వేల క్యూసెక్కులు వస్తుండగా.. జూరాల వద్ద 689 క్యూసెక్కులు నమోదు అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని