టెండరు కొనసాగించొచ్చు.. ఖరారు చేయొద్దు

మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలకు డ్యూయల్‌ టేబుళ్లు, ఫర్నిచర్‌, గ్రీన్‌బోర్డుల సరఫరా నిమిత్తం మే 9న జారీ చేసిన టెండరు ప్రక్రియను కొనసాగించడానికి బుధవారం హైకోర్టు అనుమతించింది.

Published : 07 Jul 2022 05:49 IST

మన ఊరు-మనబడిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలకు డ్యూయల్‌ టేబుళ్లు, ఫర్నిచర్‌, గ్రీన్‌బోర్డుల సరఫరా నిమిత్తం మే 9న జారీ చేసిన టెండరు ప్రక్రియను కొనసాగించడానికి బుధవారం హైకోర్టు అనుమతించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా వాటిని ఖరారు చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రీయ భాండార్‌ జెనిత్‌ మెటప్లాస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జి.రేవంత్‌ దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని