కరాచీలో దిగిన హైదరాబాద్‌ విమానం

పన్నెండు మంది ప్రయాణికులతో హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఒక అద్దె విమానం పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో దిగింది. దీనికి కారణాలేంటన్నది స్పష్టంకాలేదని పాక్‌ వర్గాలు తెలిపాయి.

Published : 16 Aug 2022 05:37 IST

కారణాలు వెల్లడికాలేదు: అధికారులు

హైదరాబాద్‌: పన్నెండు మంది ప్రయాణికులతో హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఒక అద్దె విమానం పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో దిగింది. దీనికి కారణాలేంటన్నది స్పష్టంకాలేదని పాక్‌ వర్గాలు తెలిపాయి. వీరి కథనం ప్రకారం ఈ ప్రత్యేక విమానం హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం బయలుదేరింది. మధ్యాహ్నం 12.10 గంటలకు కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దిగింది. కొద్దిసేపటికి మళ్లీ అది 12 మంది ప్రయాణికులతో అక్కడి నుంచి బయలుదేరింది. గత నెలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత్‌కు చెందిన రెండు విమానాలు కరాచీలో దిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని