ఆకాశం నుంచి ఔషధాలు..

టీశా-మెడికార్ట్‌ అనే స్టార్టప్‌ కంపెనీ డ్రోన్‌ ద్వారా ఔషధాల సరఫరా ప్రారంభించింది. సోమవారం సాయంత్రం తొలి ప్రయత్నంగా నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌కు విజయవంతంగా చేరవేసింది.

Published : 27 Sep 2022 04:44 IST

నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌కు తొలిసారి డ్రోన్‌తో మందుల సరఫరా

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: టీశా-మెడికార్ట్‌ అనే స్టార్టప్‌ కంపెనీ డ్రోన్‌ ద్వారా ఔషధాల సరఫరా ప్రారంభించింది. సోమవారం సాయంత్రం తొలి ప్రయత్నంగా నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌కు విజయవంతంగా చేరవేసింది. నిర్మల్‌ పట్టణంలో వైద్యుడు ప్రశాంత్‌ ఆ మందులను స్వీకరించారు. నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌ దాదాపు 70 కి.మీ. దూరంలో ఉంది. రోడ్డుపై వెళ్లాలంటే గంటన్నరకు పైగా సమయం పడుతుంది. డ్రోన్‌తో అరగంట కన్నా తక్కువ సమయంలోనే ఔషధాలు నిర్ణీత ప్రదేశానికి చేరుకున్నాయి. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా డ్రోన్‌ ఎక్కడకు చేరుకోవాలో, ఎలా చేరుకోవాలో ముందుగానే నిర్ణయిస్తారు. భూమికి 400 అడుగుల పైన గాలిలో ప్రయాణించే ఈ డ్రోన్‌ చేరుకోవాల్సిన ప్రదేశంలో క్యూఆర్‌ కోడ్‌ను అతికిస్తారు. 60 మీటర్ల దూరం నుంచే ఆ క్యూఆర్‌ కోడ్‌ను రీడ్‌ చేసి డ్రోన్‌ అక్కడ దిగుతుంది. ఈ విధానంలో 20 కిలోల వరకూ మందులను సరఫరా చేసేందుకు అవకాశమున్నట్లు వైద్యుడు ప్రశాంత్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని