నాగర్‌కర్నూల్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌పై అనర్హత వేటు

నాగర్‌కర్నూల్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా 2019లో ఎన్నికైన పెద్దపల్లి పద్మావతికి ముగ్గురు సంతానం ఉన్నారంటూ దాఖలైన కేసులో ఆమెపై అనర్హత వేటు పడింది.

Published : 29 Nov 2022 03:33 IST

ముగ్గురు సంతానం ఉన్నట్లు నిర్ధారణ
సమీప అభ్యర్థికి బాధ్యతలు అప్పగించిన కలెక్టర్‌

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా 2019లో ఎన్నికైన పెద్దపల్లి పద్మావతికి ముగ్గురు సంతానం ఉన్నారంటూ దాఖలైన కేసులో ఆమెపై అనర్హత వేటు పడింది. తెరాసకు చెందిన పద్మావతి తెలకపల్లి మండలం నుంచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికను రద్దు చేస్తూ రెండు రోజుల క్రితం హైకోర్టు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ పద్మావతి ఎన్నికను రద్దు చేస్తూ సమీప అభ్యర్థి (ఆమెపై కోర్టుకు వెళ్లిన) సుమిత్రను జడ్పీటీసీగా ఎన్నికైనట్లు ఉత్తర్వులిచ్చారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న పద్మావతి స్థానంలో వైస్‌ ఛైర్మన్‌ బాలాజీసింగ్‌ను ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని