పెరిగిన కోడిగుడ్డు ధర..ఒకటి రూ.7, డజను కొంటే రూ.80

కోడిగుడ్ల ధరలు పెరిగాయి. డజను గుడ్ల ధర రూ.80కి పెరగగా..ఒకదాని ధర రూ.7 అయింది. ఏడాదిగా డజను గుడ్లు రూ.65 నుంచి రూ.70 ఉండగా..ఒకటి రూ.6 కి వచ్చేది. 10 రోజుల్లోనే ఏకంగా డజను గుడ్ల ధర రూ. 80కి పెరిగింది.

Updated : 03 Dec 2022 07:22 IST

ఈనాడు-హైదరాబాద్‌: కోడిగుడ్ల ధరలు పెరిగాయి. డజను గుడ్ల ధర రూ.80కి పెరగగా..ఒకదాని ధర రూ.7 అయింది. ఏడాదిగా డజను గుడ్లు రూ.65 నుంచి రూ.70 ఉండగా..ఒకటి రూ.6 కి వచ్చేది. 10 రోజుల్లోనే ఏకంగా డజను గుడ్ల ధర రూ. 80కి పెరిగింది. వినియోగంతో పాటు.. దానా ధరలు పెరగడమే అధిక ధరలకు కారణమని నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌) బిజినెస్‌ మేనేజర్‌ సంజీవ్‌ చింతావార్‌ చెప్పారు. 2020లో గుడ్లు పెట్టే కోళ్లకు వేసే దానా ధర రూ.14 నుంచి 16 ఉండగా.. నేడు రూ.28 నుంచి 30కి పెరిగిందన్నారు. ప్రస్తుతం డిమాండ్‌కు తగ్గట్టు కోడిగుడ్ల ఉత్పత్తి లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమని నెక్‌ నిర్వాహకులు చెబుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజూ 70 లక్షల గుడ్ల వినియోగం ఉంటుందని సంజీవ్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని