తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 50 ముత్తూట్‌ మినీ శాఖలు

ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొత్తగా 11 శాఖలను తెరిచింది.

Updated : 31 Jan 2023 12:56 IST

ఈనాడు, హైదరాబాద్‌ : ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొత్తగా 11 శాఖలను తెరిచింది. రెండో దశ విస్తరణలో భాగంగా వీటిని సంస్థ ఎండీ మాథ్యూ ముత్తూట్‌ ఇటీవల ప్రారంభించారు. ఈ నెలాఖరుకు మరో 19 శాఖలను తెరవనున్నట్లు ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల్లో నూతనంగా 50 శాఖలను రెండు దశల్లో ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. తొలి దశలో భాగంగా గత నెలలో కొన్ని శాఖలను ప్రారంభించారు. వీటితో రెండు రాష్ట్రాల్లో ఈ సంఖ్య 250కి చేరనుందని, దేశవ్యాప్తంగా శాఖల సంఖ్య 900 దాటనున్నట్లు సంస్థ ఎండీ పేర్కొన్నారు. కొత్త శాఖల్లో బంగారు తనఖాపై రుణాలు, బీమా, నగదు బదిలీ, మైక్రో ఫైనాన్స్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు అందించనున్నామని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని