ఆరోగ్య రక్షణ.. సాగులో శిక్షణ..!

వ్యవసాయంలో ఎరువులు, క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా వాడుతుండడంతో అవి ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి.

Updated : 30 Jan 2023 05:39 IST

వ్యవసాయంలో ఎరువులు, క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా వాడుతుండడంతో అవి ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి. సమాజంలో దీనిపై అవగాహన పెరగడంతో ప్రజలు ఇటీవల  సేంద్రియ ఉత్పత్తులపై మక్కువ చూపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని గుండాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు బడి ఆవరణలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వీరు పండించే వంకాయ, టమాటా, సొరకాయలతో పాటు పుదీనా, పాలకూర, ఉల్లి కాడలు, మెంతి వంటి ఆకు కూరలనే పాఠశాలలో మధ్యాహ్న భోజన తయారీలో ఉపయోగిస్తున్నారు. తరగతుల వారీగా విద్యార్థులు వంతులు వేసుకుని పెంపకంలో పాలుపంచుకుంటున్నారు. ఎనిమిదేళ్లుగా ఇక్కడి విద్యార్థులు బడి ఆవరణలోని స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా అటు విద్యనభ్యసిస్తూనే ఇటు సేంద్రియ సాగు విధానాలను నేర్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

 ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని