రిజిస్ట్రార్‌ నియామక అధికారం పాలకమండలిదే..

తెలంగాణ విశ్వవిద్యాలయాల చట్టం-1991లోని సెక్షన్‌ 15(1) ప్రకారం రిజిస్ట్రార్‌ను నియమించే అధికారం పాలకమండలి(ఈసీ)కే ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.

Published : 28 May 2023 03:53 IST

ఈసీ తీర్మానాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం
తెలంగాణ వర్సిటీ ఉపకులపతికి విద్యాశాఖ కార్యదర్శి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ విశ్వవిద్యాలయాల చట్టం-1991లోని సెక్షన్‌ 15(1) ప్రకారం రిజిస్ట్రార్‌ను నియమించే అధికారం పాలకమండలి(ఈసీ)కే ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రవీందర్‌గుప్తాకు లేఖ రాశారు. ఈ నెల 25న జరిగిన ఈసీ సమావేశంలో.. తమ నిర్ణయాలను, తీర్మానాలను వీసీ పట్టించుకోవడం లేదని, రిజిస్ట్రార్‌ను నియమించే అధికారం ఉపకులపతిగా తనకే ఉందని, ఈసీ కేవలం ధ్రువపరుస్తుందని చెబుతున్నారని కొందరు సభ్యులు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ లేఖ రాసినట్లు భావిస్తున్నారు. తాత్కాలికంగానైనా రిజిస్ట్రార్‌ను నియమించే అధికారం వీసీకి లేదని, నియమ నిబంధనలు, చట్టాలు, ఈసీ నిర్ణయాలను పాటించకపోతే తీవ్రంగా పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని