ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు.. స్వచ్ఛసేవలో అధికారుల ‘చెత్త పని’

నెక్లెస్‌ రోడ్డులో ఆదివారం చేపట్టిన స్వచ్ఛ సేవా కార్యక్రమంలో అధికారుల అత్యుత్సాహం విమర్శలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో ...

Updated : 02 Oct 2023 08:19 IST

ఈనాడు హైదరాబాద్‌: నెక్లెస్‌ రోడ్డులో ఆదివారం చేపట్టిన స్వచ్ఛ సేవా కార్యక్రమంలో అధికారుల అత్యుత్సాహం విమర్శలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, సినీ నటి అక్కినేని అమల, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ తదితరులు పాల్గొన్నారు. కానీ వారు రావడానికి ముందు.. వేరే చోట నుంచి వాహనాల్లో చెత్తను తెప్పించి.. అక్కడ పారబోశారు. అనంతరం ముఖ్య అతిథులు, అధికారులు వచ్చాక వారు ఆ చెత్తను చీపుళ్లతో ఊడ్చారు. ఈ పనంతా మెడికల్‌ అధికారి భార్గవ నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. పరిశుభ్రత లేనిచోట ఈ కార్యక్రమాలు నిర్వహించాలే తప్ప.. ఇదేం చెత్త పని అని స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని