Viral Video: ఇలా చేస్తే ప్రమాదమే!

వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఆంక్షలు విధించినా కొందరు వాటిని ఖాతరు చేయడంలేదు.

Published : 15 Jun 2021 23:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు విధించినా కొందరు వాటిని ఖాతరు చేయడంలేదు. గుజరాత్ సాబర్‌కంటా జిల్లాలోని నాడా గ్రామంలో ఓ వివాహ వేడుకలో వందలాది మంది కలిసి నృత్యాలు చేశారు. గుజరాత్ ప్రభుత్వం.. పెళ్లి, తదితర వేడుకల్లో 50మంది కన్నా ఎక్కువ పాల్గొనకూడదన్న నిబంధనలను ప్రవేశపెట్టినా.. ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదు.  వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే భయం లేకుండా గుంపులుగా చిందులేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారు.  ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన గుజరాత్ సాబర్‌కంటా జిల్లా యంత్రాంగం పోలీసులను దర్యాప్తు చేయమని ఆదేశించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని