Viral Video: రెయిన్‌బో పైథాన్‌ని చూశారా!

ప్రకృతి ఎన్నో వైవిధ్యాలకు నిలయం. అందంగా ఉండే ఎన్నో ప్రమాదకరమైన జీవులు భూమ్మీద నివసిస్తున్నాయి. ఈ రెయిన్‌బో పైథాన్‌ కూడా అలాంటివాటిలో ఒకటి

Published : 25 Jun 2021 23:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రకృతి ఎన్నో వైవిధ్యాలకు నిలయం. అందంగా ఉండే ఎన్నో ప్రమాదకరమైన జీవులు భూమ్మీద నివసిస్తున్నాయి. ఈ రెయిన్‌బో పైథాన్‌ కూడా అలాంటివాటిలో ఒకటి.  దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని దేశాల్లో వీటిని ఇంట్లో పెంపుడు జంతువుగా పెంచుకుంటారు. కాలిఫోర్నియాకు చెందిన జే బ్రూవర్‌ అనే సరీసృపాల సంరక్షకుడు దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. అది కాస్తా వైరల్‌ అయింది. ఈ వీడియోకు 4.8 కోట్లకు పైగా వీక్షణలు రాగా..  రెయిన్‌బో పైథాన్‌ చాలా అందంగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని