Viral: ట్రాక్టర్‌ నడుపుకుంటూ పెళ్లి మండపానికి వెళ్లిన వధువు

సామాజిక మాధ్యమాల్లో తమ వీడియోలు వైరల్‌ అవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు ఇప్పటి యువత. అందుకోసం

Published : 01 Jul 2021 23:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో తమ వీడియోలు వైరల్‌ అవ్వాలని ఉవ్విళ్లూరుతుంటారు యువత. ఏదో విధంగా పాపులర్‌ అవ్వడానికి ప్రయత్నిస్తుంటుంది. అందుకోసం వాళ్లకు తోచిన పనులు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటారు. అయితే, మహారాష్ట్ర, పుణె జిల్లా దౌండ్ తాలుకాలో పూజా రాజారామ్‌ గైక్వాడ్‌ అనే యువతి కూడా అలానే అనుకున్నట్లుంది. అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించి ట్రాక్టర్‌ నడుపుకుంటూ పెళ్లి మండపానికి వెళ్లింది. గ్రాండ్‌గా అలంకరించిన ట్రాక్టర్‌ను రెండున్నర కిలోమీటర్లు నడిపింది. ట్రాక్టర్‌ను నడుపుతూ వధువు పెళ్లి మండపానికి వెళ్తున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని