Viral video: అచ్చంగా అమ్మలాగే..!

సాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులు చేసే పనులను పిల్లలు అనుకరిస్తుంటారు. వచ్చీ రాని మాటలతోనే అమ్మానాన్నల్లాగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ నవ్వు తెప్పిస్తుంటారు.

Published : 10 Jul 2021 23:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులు చేసే పనులను పిల్లలు అనుకరిస్తుంటారు. వచ్చీ రాని మాటలతోనే అమ్మానాన్నల్లాగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ నవ్వు తెప్పిస్తుంటారు. అలాంటి ఓ అమ్మాయి సరదాగా తన తల్లిని అనుకరిస్తూ పలికించిన హావభావాలు నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. ఆమె అలా అనుకరిస్తుండగా తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఆ వీడియోను 1.50 కోట్ల మంది వీక్షించారు. అమెరికాలోని వర్జీనియాకు చెందిన అడెల్ చులిస్‌ అనే ఎనిమిదేళ్ల చిన్నారి.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న తన తల్లి కొలీన్‌ చులిస్‌ను అనుకరించింది. అచ్చంగా అమ్మలాగే హావభావాలు పలికించింది.

వీడియోలో ఒక చేత్తో కంప్యూటర్‌.. మరో చేత్తో ఫోన్‌ పట్టుకొని బిజీ బిజీగా పనిచేస్తూ మధ్య మధ్యలో ఓ పేపర్‌పై ఏదో రాస్తూ.. అచ్చంగా తన తల్లి పని చేసే విధానాన్ని కళ్లకు కట్టినట్లు ఆ చిన్నారి అనుకరించి చూపించింది. ఈ వీడియోను లింక్‌డ్‌ఇన్‌లో పోస్టు చేయగా ఆ చిన్నారి అభినయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సరదా కామెంట్లతో తమ స్పందన తెలియజేస్తున్నారు. చిన్నారి హావభావాలు హాస్యాస్పదంగా ఉన్నా.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కష్టాలు అలాగే ఉంటాయంటూ మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని