దీదీపై మీమ్స్‌ వెల్లువ

మమతా బెనర్జీ తన ప్రసంగం ద్వారా మరోసారి సంచలనం సృష్టించారు.

Published : 11 Feb 2021 20:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రసంగం ద్వారా మరోసారి సంచలనం సృష్టించారు. అయితే ఈసారి ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది రాజకీయ వేదికలపై కాదు, సామాజిక మాధ్యమ వేదికలపై.. ముర్షీదాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో తమ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి భాజపాలో చేరిన సువేందు అధికారి తదితరులపై ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ప్లాసీ యుద్ధ సమయంలో మీర్‌ జాఫర్‌ బ్రిటిష్‌ వారితో చేతులు కలిపినట్టే .. కొందరు భాజపాలో చేరారని మమత అన్నారు. అక్కడ చేరిన వారికి రకరకాలుగా గోల చేయటం తప్ప ఏమీ రాదని ఎద్దేవా చేశారు. అటువంటి వారు త్వరగా వదిలి వెళ్లటం, పార్టీకి ప్రయోజనమే అంటూ  కొనసాగించారు.

ఆమె ప్రసంగం సంగతి అలా ఉంచితే.. ఈ క్రమంలో ఆమె చేసిన వింత ధ్వనులతో కూడిన వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్‌ అవుతుతోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తోంది. మమతా వైద్యుడి ప్రిస్కిప్షన్‌ను చదివేందుకు ప్రయత్నిస్తున్నారని, దీదీ తమిళ పాటలు వింటారని తమకు తెలీదని నెటిజన్లు అంటున్నారు. అంతేకాకుండా ఆ భాషను బాహుబలిలోని కాలకేయులతో, పాప్‌ గాయకులతో, కామెడీ నటులతో కూడా పోలుస్తున్నారు.

ఇవీ చూడండి..

చీర, పంచె కట్టుతో.. మంచులో స్కీయింగ్‌

 మైకేల్‌ జాక్స్‌న్‌ స్టెప్పులేస్తున్న కానిస్టేబుల్‌







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని