Barron Trump: 18 ఏళ్లకే ట్రంప్‌ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం

Barron Trump: వచ్చే వారమే హైస్కూల్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ కానున్న బ్యారన్ ట్రంప్‌ రాజకీయాల్లోకి రానున్నారు. పార్టీ కన్వెన్షన్‌కు ఆయన ఫ్లోరిడా ప్రతినిధిగా వెళ్లనున్నారు.

Updated : 09 May 2024 12:34 IST

మియామీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చిన్న కుమారుడు బ్యారన్‌ ట్రంప్‌ (Barron Trump) రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ‘రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌’కు ఫ్లోరిడా నుంచి ప్రతినిధిగా పంపనున్నట్లు పార్టీ ఛైర్మన్‌ ఇవన్‌ పవర్‌ బుధవారం వెల్లడించారు.

నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఆయన ఎంపికను అధికారికంగా ధ్రువీకరించేందుకు జులైలో పార్టీ కన్వెన్షన్‌ జరగనుంది. దీనికి ఫ్లోరిడా నుంచి 41 మంది ప్రతినిధులు వెళ్లనున్నారు. వారిలో బ్యారన్‌ ట్రంప్‌ ఒకరని పవర్‌ వెల్లడించారు.

ట్రంప్‌తో ఏకాంతంగా గడిపా: శృంగారతార స్టార్మీ డేనియల్స్‌

బ్యారన్‌ ట్రంప్‌ (Barron Trump) ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటూ వచ్చారు. మార్చిలో ఆయనకు 18 ఏళ్లు వచ్చాయి. వచ్చే వారమే హైస్కూల్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ కానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ‘హష్‌మనీ కేసు’లో ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

మరోవైపు ట్రంప్‌ ఇతర వారసులైన డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌, ఎరిక్‌ ట్రంప్‌, చిన్న కుమార్తె టిఫనీ సైతం పార్టీ తరఫున ఫ్లోరిడా ప్రతినిధులుగా వ్యవహరించనున్నారు. పార్టీ కన్వెన్షన్‌ విస్కాన్సిన్‌లోని మిల్వాకీ నగరంలో జులై 15-18 మధ్య జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని