Australia: ఆస్ట్రేలియా క్యాసినోలో చైనీయుల మనీలాండరింగ్‌..?

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి చైనా బ్యాంక్‌ కార్డులతో చెల్లింపునకు ఆమోదం తెలిపిన ఓ క్యాసినోకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారీగా జరిమానా విధించింది.

Published : 01 Jun 2022 02:04 IST

 రూ.445 కోట్ల ఫైన్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి చైనా బ్యాంక్‌ కార్డులతో చెల్లింపునకు ఆమోదం తెలిపిన ఓ క్యాసినోకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారీగా జరిమానా విధించింది. ఆస్ట్రేలియాకు చెందిన క్రౌన్‌ రిసార్ట్‌ నుంచి అక్కడి ప్రభుత్వం రూ.57.4 మిలియన్‌ డాలర్లు (రూ.445 కోట్లు) జరిమానా వసూలుచేసింది. ఈ జూదం కోసం వాడిన ఈ సొమ్మును రిసార్టు యాజమాన్యం హోటల్‌ సేవల నుంచి లభించిన ఆదాయంగా చూపడంతో మనీ లాండరింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

క్రౌన్‌ రిసార్ట్స్‌ సంస్థ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో విత్‌డ్రాలకు అనుమతించి ఆస్ట్రేలియా క్యాసినో నిబంధనలు ఉల్లంఘించినట్లు సోమవారం విక్టోరియా గాంబ్లింగ్‌ అండ్‌ కాసినో కంట్రోల్‌ కమిషన్‌ పేర్కొంది. మొత్తం 164 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లను విత్‌డ్రా చేసినట్లు రెగ్యూలేటరీ సంస్థ గుర్తించింది. ఈ వ్యహారం మొత్తం 2012-16 మధ్యలో చోటు చేసుకొంది. ఈ లావాదేవీలు మొత్తం సేవల విభాగంలో జరిగినట్లు చూపినట్లు గుర్తించారు. ఈ క్యాసినోలో సేకరించిన వోచర్లను పొరుగున ఉన్న క్యాసినోల్లోకి వెళ్లి నగదుగా.. లేదా చిప్స్‌గా మార్చుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నిర్వాకంతో క్రౌన్‌ సంస్థ భారీగా సంపాదించినట్లు భావిస్తున్నారు. ఈ సంస్థ పెర్త్‌, సిడ్ని, మెల్‌బోర్న్‌లో నిర్వహిస్తున్న రిసార్టులపై కూడా ఆస్ట్రేలియా అధికారులు దృష్టిపెట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని