Elon Musk: మళ్లీ కరోనా బారినపడిన ఎలాన్‌ మస్క్‌..!

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మరోసారి కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించనప్పటికీ.. తన మళ్లీ వైరస్‌ సోకిందంటూ ట్వీట్‌ చేశారు.

Published : 29 Mar 2022 02:12 IST

స్వయంగా వెల్లడించిన టెస్లా సీఈఓ

దిల్లీ: టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మరోసారి కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించనప్పటికీ.. తన మళ్లీ వైరస్‌ సోకిందంటూ ట్వీట్‌ చేశారు. అయితే, ఎలాన్‌ మస్క్‌కు కరోనా సోకడం ఇది రెండోసారి. 2020 నవంబర్‌లో వైరస్‌ బారినపడినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆ సమయంలో కొవిడ్‌ పరీక్షలపై అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. అసలు అవి కచ్చితమైన ఫలితాలు ఇస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. తాజాగా మరోసారి కొవిడ్‌ సోకిందంటూ ట్వీట్‌ చేశారు.

‘పరివర్తనకు మారుపేరు వంటిది (Theseus) కొవిడ్‌ వైరస్‌. కొవిడ్‌-19గా మారకముందు ఈ వైరస్‌లో ఎన్ని జన్యు మార్పులు చోటుచేసుకున్నాయో.? నేను మళ్లీ ఆ వైరస్‌ బారినపడ్డాను. కానీ, లక్షణాలు మాత్రం లేవు’ అని ఎలాన్‌ మస్క్‌ నిట్టూరుస్తూ ట్వీట్‌ చేశారు. అంతకుముందు కరోనా వైరస్‌ బారినపడిన సమయంలోనూ భిన్నంగా స్పందించిన ఆయన.. నిర్ధారణ పరీక్షలు కచ్చితంగా వస్తున్నాయా అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

ఇక కరోనా వ్యాక్సిన్‌లపైనా ఎలాన్‌ మస్క్‌ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. రెండో డోసు తప్పనిసరి చేయడాన్ని ఆయన తొలుత వ్యతిరేకించారు. దీంతో నిపుణుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో స్పందించిన మస్క్‌.. తాను, తన కుటుంబ సభ్యులు వ్యాక్సిన్‌ తీసుకున్నామని, విజ్ఞానశాస్త్రం నిస్సందేహమైందంటూ స్పష్టతనిచ్చారు. అయినప్పటికీ వ్యాక్సిన్‌ తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ కెనడాలో ట్రక్కు డ్రైవర్లు చేసిన ఆందోళనలకు ఆయన మద్దతు తెలపడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని