సునీతా విలియమ్స్‌ అంతరిక్ష యాత్ర వచ్చే వారమే

బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది.

Published : 09 May 2024 04:56 IST

కేప్‌ కెనావెరాల్‌: బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. దీన్ని మోసుకెళ్లే అట్లాస్‌-5 రాకెట్‌లోని సమస్యాత్మక వాల్వ్‌ను మార్చాల్సి ఉందని నిపుణులు తేల్చడమే ఇందుకు కారణం. ఈ వ్యోమనౌకలో భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్‌)కి పయనం కావాల్సి ఉంది. మంగళవారం ఉదయం స్టార్‌లైనర్‌ వ్యోమనౌక ప్రయోగం జరగాల్సింది. అయితే చివరి నిమిషంలో అట్లాస్‌-5 రాకెట్‌లోని ప్రెజర్‌-రిలీఫ్‌ వాల్వ్‌లో ఇబ్బంది తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ సాధనం తన గరిష్ఠ పనిసామర్థ్యాన్ని దాటేసిందని, దాన్ని మార్చాలని ఇంజినీర్లు తెలిపారు. ఫలితంగా స్టార్‌లైనర్‌ ప్రయోగం ఈ నెల 17 లోపు జరిగే అవకాశం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని