Elon Musk: హమాస్‌ ‘ఎక్స్‌’ఖాతాలపై బ్యాన్‌ ఎందుకంటే.. కారణం చెప్పిన మస్క్‌

హమాస్‌ సంబంధిత ఖాతాలపై బ్యాన్‌ విధించడానికి గల కారణాలను మస్క్‌ (Elon Musk) వివరించారు.

Updated : 09 Jan 2024 15:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హమాస్‌కు సంబంధించిన ఎక్స్‌ ఖాతాలను బ్యాన్‌ చేయాలన్న నిర్ణయం చాలా కఠినమైందని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వివరించారు. సోమవారం ‘కస్సం2024’ అనే ఖాతాకు సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది. ఎక్స్‌లో జాక్సన్‌ హింక్లె అనే యూజర్‌ ‘‘పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూపునకు చెందిన ఖాతాను ఎందుకు సస్పెండ్‌ చేశారు?’’ అని ప్రశ్నించారు. దీనికి మస్క్‌ స్పందిస్తూ.. ‘‘అమెరికా (USA) సహా చాలా ప్రభుత్వాల నాయకులు.. ప్రజలను చంపాలంటూ పిలుపులు ఇచ్చారు. మాకు ‘ఐరాస మినహాయింపు’ అనే నిబంధన ఉంది. ఒక ప్రభుత్వాన్ని ఐరాస గుర్తిస్తే మేము దాని ఎక్స్‌ ఖాతాలను ఎప్పటికీ సస్పెండ్‌ చేయం. హమాస్‌ను ఒక ప్రభుత్వంగా ఐరాస గుర్తించలేదు. అందుకే దాని ఖాతాలను సస్పెండ్‌ చేస్తున్నాం’’ అని వివరణ ఇచ్చారు.

మాల్దీవుల వివాదం వేళ.. బయటపడిన చైనా వక్రబుద్ధి

వాక్‌ స్వేచ్ఛకు తాను పెద్దపీట వేస్తానని మస్క్‌ గతంలో చాలా సార్లు వెల్లడించారు. కానీ, ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఆయనపై ఆన్‌లైన్‌ యూజర్లు మండిపడుతున్నారు. ‘ఎలాన్‌ మస్క్‌.. వాక్‌స్వేచ్ఛ ఎక్కడ?’ ‘వాక్‌ స్వేచ్ఛ ఎలా ఉండాలో, ఎవరికి ఉండాలో ఐరాస నిర్ణయిస్తుందా..?’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

ట్విటర్‌ను కొనుగోలు చేయకముందు మస్క్‌ ఈ వేదికలో వాక్‌స్వేచ్ఛపై ఉన్న నియంత్రణను తీవ్రంగా విమర్శించారు. ఇది అప్రకటిత పబ్లిక్‌ టౌన్‌స్క్వేర్‌గా పనిచేస్తోందన్నారు. దాన్ని కొనుగోలు చేసిన తర్వాత నుంచి పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌, కుట్రకోణాలు చెప్పే అలెక్స్‌ జోన్స్‌ వంటి ఖాతాలను కూడా పునరుద్ధరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని