18 ఏళ్ల యువకుడిగా మారాలని 16 కోట్ల ఖర్చు

వయసు పెరుగుతున్న కొద్దీ శరీర ఆకృతి మారుతుంది. యవ్వనంగా ఉండటానికి వ్యాయామాలు, ఉదయపు నడకలు వంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

Published : 27 Jan 2023 05:21 IST

చికిత్స తీసుకుంటున్న 45ఏళ్ల వ్యాపారవేత్త

కాలిఫోర్నియా: వయసు పెరుగుతున్న కొద్దీ శరీర ఆకృతి మారుతుంది. యవ్వనంగా ఉండటానికి వ్యాయామాలు, ఉదయపు నడకలు వంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, కాలిఫోర్నియాకు చెందిన జాన్సన్‌ అనే వ్యాపారవేత్త మాత్రం వీటన్నింటికీ మించి ఆలోచించాడు. 45 ఏళ్ల వయసులోనూ 18 ఏళ్ల యువకుడిలా కనిపించాలనే ఉద్దేశంతో ప్రత్యేక వైద్య చికిత్సను పొందుతున్నాడు. దీని కోసం ఏకంగా ఏడాదికి 2 మిలియన్‌ డాలర్లు(రూ.16 కోట్లు) ఖర్చు పెడుతున్నాడు. శరీరంలో కొన్ని మార్పులు చేస్తే వయసు ప్రభావం కనిపించకుండా దీర్ఘాయువు పొందవచ్చని జాన్సన్‌ ఎక్కడో చదివాడు. దీంతో 18 ఏళ్ల వయసులో తాను ఎలా కనిపించేవాడో తిరిగి ఆ రూపం పొందాలన్న కోరికతో వైద్యులను సంప్రదించాడు. ఆలివర్‌ జోల్మాన్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం జాన్సన్‌కు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా నిత్యం యువకుడిలా కనిపించేలా చికిత్స చేస్తామని హామీ ఇచ్చింది. చికిత్స తర్వాత శరీర దారుఢ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం 18 ఏళ్ల యువకుడిలా, గుండె పని తీరు 37 ఏళ్ల వ్యక్తిలా, చర్మం నిగారింపు 28 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నట్లు జాన్సన్‌ మీడియాకు వెల్లడించారు. జాన్సన్‌ ఇంట్లోనే భారీ ఖర్చుతో ప్రత్యేక పరికరాలతో ల్యాబ్‌ను సిద్ధం చేశారు. 30మంది వైద్యులు ఆతన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి అవయవం 18 ఏళ్ల యువకుడిలా మారేంత వరకు చికిత్స కొనసాగిస్తానని అతను చెబుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని