మా బెలూన్‌ కూల్చివేత విచక్షణారహితం

తమ దేశానికి చెందిన వాతావరణ పరిశోధన బెలూన్‌ను అమెరికా కూల్చివేయడంపై చైనా సోమవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published : 07 Feb 2023 04:11 IST

అమెరికా చర్యపై చైనా మండిపాటు

బీజింగ్‌: తమ దేశానికి చెందిన వాతావరణ పరిశోధన బెలూన్‌ను అమెరికా కూల్చివేయడంపై చైనా సోమవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా సైన్యం యుద్ధ విమానాలను ఉపయోగించి అనుమానాస్పద బెలూన్‌ను నిఘా బెలూన్‌గా భావిస్తూ శనివారం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ చర్య విచక్షణారహితమైనదని చైనా అభివర్ణించింది. ఈ పరిణామం చైనా-అమెరికాల మధ్య నెలకొన్న అంతరాలను తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను, పురోగతిని ప్రభావితం చేయడంతోపాటు దెబ్బతీసిందని పేర్కొంది. ఈ సంఘటనపై అమెరికా రాయబార కార్యాలయానికి ఆదివారం ఫిర్యాదు చేసినట్లు చైనా ఉప విదేశీ వ్యవహారాల మంత్రి షీ ఫెంగ్‌ వెల్లడించారు. అమెరికా భూ భాగాన్ని విడిచి వెళ్లిపోతున్న వాతావరణ పరిశోధనలకు ప్రయోగించిన పౌర బెలూన్‌ను అంతర్జాతీయ న్యాయ సూత్రాల స్ఫూర్తిని మరిచి కూల్చివేయడం అతిగా స్పందించడమేనని పేర్కొన్నారు.

ఆ బెలూనూ మాదే.. లాటిన్‌ అమెరికా గగనతలంలో గుర్తించిన భారీ బెలూన్‌ తమ దేశానికి చెందినదేనని చైనా సోమవారం ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు