భారత్‌ను మా పాదాల కింద నలిపివేయగలం

పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధమని గత నెల ప్రకటించిన ఆయన.. ఇప్పుడు భారత్‌పై బెదిరింపులకు దిగారు.

Published : 07 Feb 2023 04:19 IST

పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధమని గత నెల ప్రకటించిన ఆయన.. ఇప్పుడు భారత్‌పై బెదిరింపులకు దిగారు. ‘‘భారతదేశం మాపై డేగ కన్ను వేస్తే.. అణ్వాయుధాలు గల మేము ఆ దేశాన్ని మా పాదాల కిందే నలిపివేయగలం’’ అని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు. కశ్మీర్‌కు రాజకీయ, దౌత్య, నైతిక సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం పీఓకేలో ఇమ్రాన్‌ సారథ్యంలోని తెహ్రిక్‌-ఇ-ఇన్సాఫ్‌ పార్టీ అధికారంలో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు