Kim jong un: మళ్లీ కుమార్తెతో కనిపించిన కిమ్
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మళ్లీ తన కుమార్తె కిమ్-జు-యేతో కనిపించారు. దేశ సైనిక వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా బుధవారం ఆయన సైనికాధికారులను కలిశారు.
సైనికాధికారులతో భేటీ
సియోల్: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మళ్లీ తన కుమార్తె కిమ్-జు-యేతో కనిపించారు. దేశ సైనిక వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా బుధవారం ఆయన సైనికాధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె కూడా ఉన్నారు. త్వరలో భారీ సైనిక కవాతు జరగనుందని, అందులో ఉత్తరకొరియా తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపనుందన్న వార్తలొస్తున్న నేపథ్యంలో కిమ్.. సైన్యంలోని ప్రముఖలతో భేటీ అవ్వడం విశేషం. కుమార్తెతో కలిసి కిమ్ కనిపించడం ఇది నాలుగో సారి. ఇలా పదే పదే కుమార్తెతో ప్రత్యక్షమవ్వడం వెనుక.. భవిష్యత్తులో పగ్గాలు తన వారసులకే దక్కుతాయన్న సంకేతాలను కిమ్ పంపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
Sports News
ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్
-
Movies News
భయపెట్టేందుకు బరిలోకి ఎన్టీఆర్
-
World News
Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
-
World News
US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!
-
World News
UNSC: రష్యా చేతికి యూఎన్ఎస్సీ పగ్గాలు.. ‘చెత్త జోక్’గా పేర్కొన్న ఉక్రెయిన్!