ఇమ్రాన్‌ మానసిక స్థితిపై అనుమానాలు

పాక్‌ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ (70) ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్‌ ఖాదిర్‌ పటేల్‌ సంచలన ప్రకటన చేశారు.

Published : 27 May 2023 06:39 IST

పాక్‌ ఆరోగ్యమంత్రి అబ్దుల్‌ ఖాదిర్‌ వెల్లడి

ఇస్లామాబాద్‌: పాక్‌ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ (70) ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్‌ ఖాదిర్‌ పటేల్‌ సంచలన ప్రకటన చేశారు. ఇమ్రాన్‌ మానసిక పరిస్థితి స్థిమితంగా ఉండటం లేదని, ఆయన మూత్ర నమూనాలో మద్యం, మాదకద్రవ్యాల ఆనవాళ్లు ఉన్నట్లు తెలిపారు. అల్‌-ఖదీర్‌ ట్రస్టు అవినీతి కేసులో మే 9న ఇమ్రాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చేసిన ఆరోగ్య పరీక్షల సందర్భంగా పాకిస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (పిమ్స్‌) ఆయన నుంచి సేకరించిన నమూనాల వైద్య నివేదికపై మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇమ్రాన్‌ మానసిక ఆరోగ్యం అనుమానాస్పదంగా ఉన్నట్లు అయిదుగురు సీనియర్‌ వైద్యుల కమిటీ వెల్లడించిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని