Lockdown: జంతువులకు కలిసొచ్చిన లాక్‌డౌన్‌

కొవిడ్‌-19 విజృంభణ కారణంగా 2020 జనవరి నుంచి మే వరకూ కఠిన లాక్‌డౌన్‌ అమలు చేయడం జంతువులకు బాగా స్వేచ్ఛనిచ్చిందని పరిశోధకులు తెలిపారు.

Updated : 11 Jun 2023 09:51 IST

దిల్లీ: కొవిడ్‌-19 విజృంభణ కారణంగా 2020 జనవరి నుంచి మే వరకూ కఠిన లాక్‌డౌన్‌ అమలు చేయడం జంతువులకు బాగా స్వేచ్ఛనిచ్చిందని పరిశోధకులు తెలిపారు. పది రోజుల్లోనే అవి 73 శాతం మేర ఎక్కువ దూరం నడిచాయని వివరించారు. సాధారణంతో పోలిస్తే 36 శాతం మేర రోడ్లకు చేరువగా వచ్చాయని పేర్కొన్నారు. వాహనాలు, మానవ సంచారం లేకపోవడంతో అవి నిర్భయంగా తిరిగాయని తెలిపారు. భవిష్యత్‌లో అనుసరించాల్సిన జంతు సంరక్షణ వ్యూహాల రూపకల్పనకు ఈ పరిశోధన సాయపడుతుందని తెలిపారు. మనుషుల వ్యవహారశైలిలో మార్పుల వల్ల జంతువుల జీవితాలపై సానుకూల ప్రభావం పడుతుందని ఇది స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు 43 భిన్న క్షీరదాల జాతులకు జీపీఎస్‌ పరికరాలను అమర్చి, ఈ అధ్యయనం చేశారు. వీటిలో ఏనుగులు, జిరాఫీలు, ఎలుగుబంట్లు, జింకల వరకూ అనేకం ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని