Corona: కొవిడ్‌లో కొత్త వేరియంట్‌!

కొవిడ్‌-19లో ఒమిక్రాన్‌ రకం నుంచి వచ్చిన ‘ఈజీ.5.1’ అనే కొత్త వేరియంట్‌ బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఇక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

Updated : 05 Aug 2023 08:20 IST

బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి

లండన్‌: కొవిడ్‌-19లో ఒమిక్రాన్‌ రకం నుంచి వచ్చిన ‘ఈజీ.5.1’ అనే కొత్త వేరియంట్‌ బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఇక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దీని వాటా 14.6 శాతంగా ఉందన్నారు. ఈ వేరియంట్‌ను తొలుత గత నెలలో గుర్తించారు. అంతర్జాతీయంగా కూడా దీని కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీని తీరును జాగ్రత్తగా గమనిస్తోంది. ప్రజలు టీకాలు పొందినప్పటికీ, ఇప్పటికే కరోనా బారినపడి, కోలుకున్నప్పటికీ అలసత్వానికి తావివ్వకూడదని స్పష్టంచేసింది. ఈ వేరియంట్‌తో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ వస్తుందన్న సూచనలేమీ లేవని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని