new zealand: న్యూజిలాండ్‌ తదుపరి ప్రధాని క్రిస్టఫర్‌ లుక్సాన్‌

న్యూజిలాండ్‌ ఎన్నికల్లో నేషనల్‌ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. శనివారం చేపట్టిన కౌంటింగ్‌లో 40 శాతంపైగా ఓట్లు సాధించి దూసుకుపోతోంది.

Updated : 15 Oct 2023 05:11 IST

ఎన్నికల్లో నేషనల్‌ పార్టీకి 40 శాతం ఓట్లు

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌ ఎన్నికల్లో నేషనల్‌ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. శనివారం చేపట్టిన కౌంటింగ్‌లో 40 శాతంపైగా ఓట్లు సాధించి దూసుకుపోతోంది. అధికార లేబర్‌ పార్టీకి 25 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో నేషనల్‌ పార్టీ నేత, మాజీ వ్యాపారవేత్త క్రిస్టఫర్‌ లుక్సాన్‌(53) ప్రధాని పదవిని చేపట్టబోతున్నారు. యాక్ట్‌(ఏసీటీ) పార్టీతో కలిసి ఆయన నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచిన అనంతరం క్రిస్టఫర్‌ లుక్సాన్‌.. ఆక్లాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తన మద్దతుదారుల కేరింతల మధ్య కుటుంబంతో కలసి వేదికపైకి వచ్చి ప్రసంగించారు. మీరంతా మార్పునకు ఓటు వేశారని, అందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు. ఈ  ఫలితాలను ఊహించలేదని ప్రస్తుత ప్రధాని క్రిస్‌ హిప్‌కిన్స్‌ పేర్కొన్నారు.

క్రిస్టఫర్‌ లుకాన్స్‌ రాజకీయ ప్రవేశం చేసి నాలుగేళ్లే అయింది. ఇంత తక్కువ కాలంలోనే ఆయన ప్రధాని పీఠాన్ని అధిరోహించనుండటం విశేషం. అంతకు ముందు ఆయన న్యూజిలాండ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలోని విమానయాన సంస్థ ఎయిర్‌ న్యూజిలాండ్‌ సీఈవోగా ఏడేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని