Sleep: నిద్ర కరవుతో సానుకూల అనుభూతుల తగ్గుదల

రాత్రిపూట సరిగా నిద్ర పోలేకపోతే అది దైనందిన జీవితంలో మనం స్పందించే తీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తాజా పరిశోధన తేల్చింది. నిద్రపై 50 ఏళ్లుగా జరిపిన 154 పరిశోధనల ద్వారా అమెరికన్‌ శాస్త్రవేత్తలు దీనిని నిర్ధారించారు.

Updated : 25 Dec 2023 07:21 IST

దిల్లీ: రాత్రిపూట సరిగా నిద్ర (Sleep) పోలేకపోతే అది దైనందిన జీవితంలో మనం స్పందించే తీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తాజా పరిశోధన తేల్చింది. నిద్రపై 50 ఏళ్లుగా జరిపిన 154 పరిశోధనల ద్వారా అమెరికన్‌ శాస్త్రవేత్తలు దీనిని నిర్ధారించారు. ఒకటీ రెండు రాత్రులపాటు అరకొర నిద్ర పోయినా, ఎక్కువ సేపు మేల్కొని ఉన్నా, మగత నిద్ర పోయినా అది మనలో ఆనందం, సంతృప్తి వంటి సానుకూల అనుభూతులను తగ్గించేస్తుంది. భావోద్వేగభరిత ఘటనలపై స్పందనను మొద్దుబారేలా చేేస్తుంది. నిద్ర తగ్గినప్పుడు గుండె ఎక్కువ వేగంతో కొట్టుకొంటుంది. ఆదుర్దా పెరుగుతుంది. రాత్రిపూట ఒకటీ రెండు గంటలు అదనంగా మేల్కొని ఉన్నా లేక కొన్ని గంటలు మాత్రమే నిద్ర పోయినా దుష్ప్రభావాలు కనిపిస్తాయి. సాధారణంగా విమాన పైలట్లు, పాత్రికేయులు, ట్రక్కు డ్రైవర్ల వంటివారికి నిద్ర కరవు అవుతుంది. అది వారి దైనందిన కార్యకలాపాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీన్ని తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాలని అధ్యయనకర్తలు సూచించారు. 30 శాతం వయోజనులు, 90 శాతం టీనేజర్లు సరిగా నిద్రపోవడం లేదని కనుగొన్నారు. నిద్ర కరవు కొంతమందిపై ఎక్కువ ప్రభావం చూపడానికి కారణమేమిటో కనిపెట్టాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని