హైజాక్‌ అయిన నౌక భారత్‌కు వస్తున్నదే

ఇరాన్‌ శనివారం హైజాక్‌ చేసిన ఎంఎస్‌సీ ఏరీస్‌ నౌక భారత్‌కు వస్తున్నదేనని నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌ తెలిపారు.

Updated : 15 Apr 2024 06:06 IST

పణజీ: ఇరాన్‌ శనివారం హైజాక్‌ చేసిన ఎంఎస్‌సీ ఏరీస్‌ నౌక భారత్‌కు వస్తున్నదేనని నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌ తెలిపారు. అది మన దేశంలోని ఒక తీరానికి చేరాల్సి ఉందని చెప్పారు. గోవాలోని వాస్కోలో ఐఎన్‌ఎస్‌ హంసపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దీనిపై ఇప్పటివరకూ ఎటువంటి తాజా సమాచారం లేదని తెలిపారు. ఇజ్రాయెలీ కుబేరుడికి చెందిన విదేశీ జెండాతో ఉన్న ఈ నౌకలో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే.

ఇరాన్‌ విదేశాంగ మంత్రితో జైశంకర్‌ చర్చలు

ఎంఎస్‌సీ ఏరీస్‌ నౌకలోని 17 మంది భారతీయ సిబ్బంది కోసం ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియాన్‌తో మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఆదివారం మాట్లాడారు. వారిని విడుదల చేయాలని కోరారు. పశ్చిమాసియాలో ఘర్షణలను నివారించాలని, దౌత్య మార్గాల్లో పరిష్కారం చూడాలని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని