Japan : జపాన్‌లో జనాభా తగ్గిపోతోంది..!

సాంకేతికంగా ఎప్పుడూ ముందుండే జపాన్‌ జనాభాలో మాత్రం వెనుకడుగు వేస్తోంది. ఆ దేశ జనాభా రోజురోజుకూ తగ్గిపోతుంది.

Published : 17 Apr 2022 02:01 IST

టోక్యో: సాంకేతికంగా ఎప్పుడూ ముందుండే జపాన్‌ జనాభాలో మాత్రం వెనుకడుగు వేస్తోంది. ఆ దేశ జనాభా రోజురోజుకూ తగ్గిపోతుంది. వృద్ధులు ఎక్కువవుతున్నారు. తాజాగా విడుదల చేసిన 2021 జనాభా లెక్కలు ఈ సమస్యకు అద్దంపడుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో జపాన్‌ జనాభా 125 మిలియన్లు కాగా, ఈ సంవత్సరం వీరిలో 6 లక్షల మంది తగ్గారు. దేశ జనాభా వేగంగా తగ్గుతోందని అంతర్గత వ్యవహారాలు, కమ్యూనికేషన్‌ మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. వరుసగా 11వసారి జనాభా తగ్గుదల నమోదైందని పేర్కొంది.

మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 15 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉన్న వారు గతంతో పోలిస్తే 5 లక్షలు తగ్గి దేశ జనాభాలో 59.4శాతంగా ఉన్నారు. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులు రికార్డు స్థాయిలో 28.9శాతానికి  చేరుకున్నారు. 14 సంత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు కేవలం 11.8శాతంగా ఉన్నారు. ఇక కఠినమైన సరిహద్దు ఆంక్షల కారణంగా జపాన్‌లో నివసిస్తోన్న విదేశీ పౌరుల సంఖ్య  కూడా తగ్గింది. జపాన్‌ పేరు చెప్పగానే గుర్తొచ్చే టోక్యోలో 26 సంవత్సరాల తర్వాత జనాభా తగ్గింది. జపాన్‌లో గత కొంత కాలం నుంచి జననాల రేటు కంటే మరణాల రేటు ఎక్కువగా ఉంది. జనాభా తగ్గుదలపై కొవిడ్‌ సైతం తీవ్ర ప్రభావం చూపిందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని