Nithyananda: ఐరాసలో నిత్యానంద దేశ ప్రతినిధి.. భారత్‌పైనే ఆరోపణలు

వివాదాస్పద మత గురువు నిత్యానంద(Nithyananda) కొన్నేళ్ల క్రితం సొంతంగా దేశాన్ని ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఆ దేశం తరఫు నుంచి ప్రతినిధిని ఐరాసకు పంపారు. 

Updated : 28 Feb 2023 21:56 IST

జెనీవా: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న వివాదాస్పద స్వామిజీ నిత్యానంద(Nithyananda) దేశం యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్‌ కైలాస(USK).. ఐరాస సమావేశాల్లో పాల్గొనింది.  ఆ దేశ ప్రతినిధి ఐరాసలో ప్రత్యక్షమై అందరిని ఆశ్చర్యపర్చారు. నిత్యానందను భారత్‌ వేధిస్తోందని ఆమె ఆరోపించారు. ఆయనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.  జెనీవాలో గత వారం జరిగిన ఐరాస సమావేశంలో ఈ మహిళా ప్రతినిధి విజయప్రియ నిత్యానంద హాజరయ్యారు. తన దేశం నుంచి ఐరాసలో శాశ్వత ప్రతినిధినంటూ పరిచయం చేసుకున్నారు. 

‘కైలాస.. హిందువుల కోసం ఏర్పడిన మొదటి సార్వభౌమదేశం. దీనిని నిత్యానంద పరమశివమ్‌ స్థాపించారు. ఆయన హిందూమత పునరుజ్జీవం కోసం పాటుపడుతున్నారు’ అంటూ  తన దేశం, తన దేశాధినేత గురించి వెల్లడించారు. అలాగే ఆ దేశం నుంచి మరో ప్రతినిధి ఈఎన్‌ కుమార్‌ కూడా హాజరయ్యారు.  

కైలాస అనేది నిత్యానంద(Nithyananda) ప్రపంచం. దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసకు సొంతంగా డాలర్‌, రిజర్వ్‌ బ్యాంకు, జెండా, పాస్‌పోర్టును తీసుకొచ్చారు. అత్యాచారం సహా వివిధ ఆరోపణలతో 2019లో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద.. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో ఉన్నట్లు  ఇంటర్‌పోల్‌ వర్గాలు చెబుతున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని