Rishi Sunak: సిగరెట్లపై నిషేధం విధించనున్న సునాక్‌ ప్రభుత్వం!

తమ దేశాన్ని పొగ రహిత దేశంగా మార్చేందుకు బ్రిటన్‌ (Britan)ప్రభుత్వం యోచిస్తోంది. భవిష్యత్తు తరానికి సిగరెట్ల విక్రయించకుండా నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Updated : 23 Sep 2023 17:12 IST

లండన్‌: తమ దేశాన్ని పొగ రహితంగా మార్చేందుకు బ్రిటన్‌ (Britan) ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం భవిష్యత్తు తరం సిగరెట్లు (cigarettes)వినియోగించకుండా వాటి అమ్మకంపై త్వరలో నిషేధం విధించేందుకు ప్రణాళికలు రచిస్తోందని బ్రిటన్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు గార్డియన్‌ పత్రిక శుక్రవారం కథనాలు ప్రచురించింది.

భవిష్యత్తు తరం సిగరెట్ల వినియోగించడం, కొనుగోలు చేయడంపై నిషేధం విధించే అంశాన్ని ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak)ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయంలో రిషి న్యూజిలాండ్‌ చట్టాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2009 లేదా ఆ తర్వాత జన్మించిన వారికి సిగరెట్లను విక్రయించకూడదంటూ గతేడాది న్యూజిలాండ్‌ (New Zealand)నిషేధం విధించిన విషయం తెలిసిందే. అదే విధంగా బ్రిటన్‌ ప్రధాని కూడా అమ్మకాలపై నిషేధం విధించే అవకాశం ఉందని బ్రిటన్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ముందు ఈ మూడు పనులు చేయండి.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్‌

‘‘ప్రజలు పొగ తాగడాన్ని మాన్పించడానికి పలు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నాం. ఈ మేరకు 2030 నాటికి పొగరహిత దేశంగా బ్రిటన్‌ అవతరించేలా చేయడమే మా లక్ష్యం. అంతేకాకుండా, పొగ తాగడాన్ని నియంత్రించేందుకు ఉచిత వేప్‌ కిట్‌ల పంపిణీ, గర్భిణిలకు ప్రోత్సహకాలు అందించేలా వోచర్‌ పథకాన్ని రూపొందించాం’’ అని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సునాక్‌ ప్రభుత్వం ఈ విధాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు