Published : 01 Jul 2022 01:44 IST

Putin: ‘నాటోలో ఆ రెండు దేశాల చేరికపై మాకేం సమస్య లేదు. కానీ..’ పుతిన్‌ కీలక వ్యాఖ్యలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిన్లాండ్‌, స్వీడన్‌లు నాటోలో చేరితే రష్యాకు ఎటువంటి ఇబ్బంది లేదని పుతిన్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ మాదిరి ఆ రెండు దేశాలతో తమకెలాంటి ప్రాదేశిక విభేదాలు లేవని తెలిపారు. తుర్క్‌మెనిస్థాన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘నాటోలో స్వీడన్, ఫిన్లాండ్‌ల చేరిక విషయమై మాకు ఎలాంటి సమస్య లేదు. అది వారి ఇష్టం. వారు కోరుకున్నదాంట్లో చేరొచ్చు. అయితే.. మిలిటరీ బృందాలు, సైనిక మౌలిక సదుపాయాలను అక్కడ మోహరించినట్లయితే మాత్రం.. మేం తగు రీతిలో స్పందిస్తాం. ఆ ఏర్పాట్లతో రష్యాకు ఎటువంటి ముప్పు ఉత్పన్నమవుతుందో.. మేం సైతం అదే తరహా వ్యవహరిస్తాం’ అని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం మా మధ్య అంతా బాగానే ఉంది. కానీ.. ఇకముందు కొన్ని ఉద్రిక్తతలు ఉండొచ్చు. మాకు ముప్పు ఉంటే అవి అనివార్యం’ అని చెప్పారు.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య పరిణామాల నేపథ్యంలో.. స్వీడన్, ఫిన్లాండ్‌లు నాటో కూటమిలో చేరేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో జరిగిన నాటో సదస్సులో వాటి సభ్యత్వం కోసం అధికారిక ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు.. ఈ రెండు దేశాల చేరికపై అభ్యంతరం చెబుతూ వచ్చిన తుర్కియే(టర్కీ) సైతం ఎట్టకేలకు తన అంగీకారాన్ని తెలిపింది. రష్యా మొదటినుంచి విమర్శిస్తూ వచ్చింది. ఈ వ్యవహారాన్ని.. అంతర్జాతీయ భద్రతను అస్థిరపరిచే అంశంగా పేర్కొంది. ఈ క్రమంలోనే పుతిన్ తాజాగా మాట్లాడుతూ.. ఉక్రెయిన్ వివాదం ద్వారా నాటో దేశాల నేతలు తమ ఆధిపత్యాన్ని, సామ్రాజ్యవాద ధోరణిని చాటుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. వారి లక్ష్యం.. ఉక్రెనియన్ల శ్రేయస్సు కాదని, సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకేనని అన్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts